Independence Day: ఎర్రకోటపై స్వాతంత్ర్య వేడుకలు.. అతిథులుగా వీధి వ్యాపారులు

దేశ రాజధాని దిల్లీలోని చారిత్రక కట్టడం ఎర్రకోట వద్ద స్వాతంత్ర్య వేడుకలు అంబరాన్నంటాయి. ప్రధానమంత్రి నరేంద్రమోదీ జాతీయ జెండాను ఎగురవేసి జాతినుద్దేశించి ప్రసంగించారు. ఈ సంబరాలకు రాజకీయ ప్రముఖులతో

Published : 15 Aug 2022 14:21 IST

దిల్లీ: దేశ రాజధాని దిల్లీలోని చారిత్రక కట్టడం ఎర్రకోట వద్ద స్వాతంత్ర్య వేడుకలు అంబరాన్నంటాయి. ప్రధానమంత్రి నరేంద్రమోదీ జాతీయ జెండాను ఎగురవేసి జాతినుద్దేశించి ప్రసంగించారు. ఈ సంబరాలకు రాజకీయ ప్రముఖులతో పాటు పలువురు సామాన్యులు ‘ముఖ్య అతిథులు’గా హాజరయ్యారు. వీధి వ్యాపారులు, అంగన్వాడీ కార్యకర్తలు, మార్చురీ సిబ్బంది తదితరులు ముఖ్య అతిథులుగా స్వాతంత్ర్య వేడుకల్లో పాల్గొన్నారు.

రెండేళ్ల పాటు కరోనా మహమ్మారి కోరల్లో చిక్కుకుని ఇప్పుడిప్పుడే ఆ వైరస్‌ నుంచి కాస్త బయటపడుతున్న సమయంలో యావత్ దేశం ఆజాదీ కా అమృత్‌ మహోత్సవ్‌ ఉత్సవాలను జరుపుకొంటోంది. ఈ సందర్భంగా కరోనా సమయంలో సేవలందించిన వారిని ప్రత్యేకంగా గుర్తించి వారిని ఎర్రకోట వద్ద స్వాతంత్ర్య వేడుకలకు ఆహ్వానించింది. అంగన్వాడీ కార్యకర్తలు, మార్చురీ సిబ్బందితో పాటు వీధి వ్యాపారులు, ముద్రా పథకం లబ్ధిదారులు ముఖ్య అతిథులుగా పాల్గొని వేడుకలను ప్రత్యక్షంగా తిలకించారు.

ఈ ఏడాది గణతంత్ర దినోత్సవానికి కూడా పలువురు సామాన్యులు ముఖ్య అతిథులుగా హాజరైన విషయం తెలిసిందే. ఫ్రంట్‌లైన్‌ వర్కర్లు, స్వచ్ఛాగ్రహ్‌ సిబ్బంది, ఆటో రిక్షా కార్మికులు, నిర్మాణ కూలీలు, శకటాలను తయారుచేసిన కూలీలు ఆ వేడుకలను ప్రత్యక్షంగా వీక్షించారు.

Read latest India News and Telugu News

Follow us on Facebook, Twitter, Instagram & Google News.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

ap-districts
ts-districts

ఎక్కువ మంది చదివినవి (Most Read)

మరిన్ని