అన్నా హజారే నిరవధిక నిరహార దీక్ష రద్దు 

మూడు వ్యవసాయ చట్టాలకు వ్యతిరేకంగా రైతులకు మద్దతుగా నిరవధిక నిరాహర దీక్షకు దిగుతానని ప్రకటించిన కొన్ని గంటల వ్యవధిలోనే సామాజిక ఉద్యమకారుడు అన్నా హజారే

Published : 29 Jan 2021 23:40 IST

పుణె: రైతు సమస్యలపై నిరవధిక నిరాహర దీక్షకు దిగుతానని ప్రకటించిన కొన్ని గంటల వ్యవధిలోనే సామాజిక ఉద్యమకారుడు అన్నా హజారే తన నిర్ణయాన్ని మార్చుకున్నారు. శనివారం చేపట్టనున్న నిరవధిక నిరాహార దీక్షను రద్దు చేసుకుంటున్నట్టు ప్రకటించారు. భాజపా సీనియర్‌ నేత, మాజీ సీఎం దేవేంద్ర ఫడణవీస్‌, కేంద్ర వ్యవసాయశాఖ సహాయ మంత్రి కైలాష్‌ చౌదరి హజారేతో సమావేశమయ్యారు. అనంతరం నిర్వహించిన మీడియా సమావేశంలో వారి సమక్షంలోనే హజారే ఈ నిర్ణయాన్ని ప్రకటించారు. తన డిమాండ్లలో కొన్నింటిని కేంద్ర ప్రభుత్వం అంగీకరించిందన్నారు. అలాగే, రైతుల జీవితాలను మెరుగుపరిచేందుకు ఓ కమిటీని కూడా ఏర్పాటు చేస్తామని ప్రకటించిందన్నారు. అందువల్ల శనివారం నుంచి తాను తలపెట్టిన నిరవధిక నిరాహార దీక్షను రద్దు చేసుకుంటున్నట్టు వెల్లడించారు. 83 ఏళ్ల అన్నా హజారే రైతు సమస్యలను పరిష్కరించాలని డిమాండ్‌ చేస్తూ ప్రధాని నరేంద్ర మోదీకి గతంలో లేఖ రాశారు. జనవరి ఆఖరు నాటికి ఈ డిమాండ్లపై సానుకూలంగా స్పందించకపోతే నిరవధిక నిరాహార దీక్షకు దిగుతానని హెచ్చరించిన విషయం తెలిసిందే.

ఇదీ చదవండి..

ఎవరీ రాకేశ్‌ టికాయిత్‌?

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు