Kerala: కేరళలో ‘మెదడును తినే అమీబా’.. మరో కేసు నమోదు

‘మెదడును తినే అమీబా (అమీబిక్‌ మెనింజో ఎన్‌సెఫలైటిస్‌)’ అరుదైన వ్యాధి కేరళ ప్రజలను భయాందోళనలకు గురి చేస్తోంది. కాగా తాజాగా మరో కేసు నమోదైంది.

Published : 06 Jul 2024 13:41 IST

కోజికోడ్‌: ‘మెదడును తినే అమీబా (అమీబిక్‌ మెనింజో ఎన్‌సెఫలైటిస్‌)’ అనే అరుదైన వ్యాధి కేరళలో కలకలం సృష్టిస్తోంది. ఈ వ్యాధి బారిన పడి బుధవారం 14 ఏళ్ల మృదుల్‌ అనే ఓ బాలుడు మృతి చెందగా తాజాగా మరో కేసు నమోదైనట్లు అధికారిక వర్గాలు వెల్లడించాయి. దీంతో మొత్తం కేసుల సంఖ్య నాలుగుకు చేరింది.

కోజికోడ్ జిల్లాలోని పయోలి ప్రాంతంలో నివసిస్తున్న మరో 14 ఏళ్ల బాలుడికి ఈ వ్యాధి సోకడంతో చికిత్స అందిస్తున్నట్లుగా వైద్యులు పేర్కొన్నారు. ప్రస్తుతం అతడి పరిస్థితి మెరుగవుతోందని వెల్లడించారు.

శుక్రవారం ముఖ్యమంత్రి పినరయి విజయన్‌ ఉన్నత స్థాయి వైద్యాధికారులతో చర్చలు జరిపారు. అంటువ్యాధులు వ్యాప్తి చెందకుండా నివారించడానికి తగిన చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించారు. పిల్లలు ఎక్కువగా ఈ వ్యాధి బారిన పడుతున్నందున నీటికుంటలను పరిశుభ్రంగా ఉంచేందుకు ప్రతి ఒక్కరూ శ్రద్ధ వహించాలని ఆయన సూచించారు.

కలుషిత జలాల్లో ఉండే అమీబా బ్యాక్టీరియా ముక్కు ద్వారా శరీరంలోకి ప్రవేశించినప్పుడు అమీబిక్‌ మెనింజో ఎన్‌సెఫలైటిస్‌ వ్యాధి సోకుతుంది. ఈ ఏడాది మేలో మలప్పురంలో ఐదేళ్ల ఓ బాలిక, జూన్‌లో కన్నూర్‌లో 13 ఏళ్ల మరో బాలిక ఇదే వ్యాధితో మరణించడం గమనార్హం. 2017, 2023ల్లో అలప్పుజ జిల్లాలో అమీబిక్‌ మెనింజో ఎన్‌సెఫలైటిస్‌ కేసులు నమోదయ్యాయి. 

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని