Gyanvapi Masjid: జ్ఞానవాపి మసీదు కేసులో మరో కీలక మలుపు

జ్ఞానవాపి మసీదు కేసులో మరో కీలక పరిణామం చోటు చేసుకుంది. మసీదులోని వాజూఖానాలో లభించిన శివలింగం కార్బన్‌ డేటింగ్‌ను తిరస్కరిస్తూ వారణాసి జిల్లా...

Updated : 05 Nov 2022 07:00 IST

శివలింగం ‘కార్బన్‌ డేటింగ్‌’ పిటిషన్‌ను స్వీకరించిన అలహాబాద్‌ హైకోర్టు
అంజుమన్‌ ఇంతెజామియా కమిటీకి నోటీసులు

ప్రయాగ్‌రాజ్‌: జ్ఞానవాపి మసీదు కేసులో మరో కీలక పరిణామం చోటు చేసుకుంది. మసీదులోని వాజూఖానాలో లభించిన శివలింగం కార్బన్‌ డేటింగ్‌ను తిరస్కరిస్తూ వారణాసి జిల్లా కోర్టు ఇచ్చిన తీర్పును సవాల్‌ చేస్తూ లక్ష్మీదేవి, మరో ముగ్గురు హిందు మహిళా భక్తులు దాఖలు చేసిన రివిజన్‌ పిటిషన్‌ను అలహాబాద్‌ హైకోర్టు శుక్రవారం విచారణకు స్వీకరించింది. మసీదును నిర్వహిస్తున్న అంజుమన్‌ ఇంతెజామియా కమిటీకి నోటీసులు జారీ చేసింది. గత నెల 14న వారణాసి జిల్లా కోర్టు న్యాయమూర్తి తన తీర్పులో.. శివలింగాన్ని సురక్షితంగా భద్రపరచమని సుప్రీంకోర్టు ఆదేశాలిచ్చిందని, అందుకే వయసు, స్వరూపం నిర్ధారించే కార్బన్‌ డేటింగ్‌ పరీక్షకు అనుమతులు ఇవ్వలేమని పేర్కొన్నారు. మరోవైపు జ్ఞానవాపి మసీదులోని శృంగార గౌరి, ఇతర హిందూ దేవతల విగ్రహాలను పూజించుకొనేందుకు అనుమతి కోరుతూ వేసిన పిటిషన్‌కు విచారణర్హత ఉందంటూ వారణాసి జిల్లా కోర్టు ఇచ్చిన తీర్పును సవాల్‌ చూస్తూ అంజుమన్‌ ఇంతెజామియా మసీదు కమిటీ వేసిన అపీల్‌పై విచారణను అలహాబాద్‌ హైకోర్టు ఈ నెల 22కు వాయిదా వేసింది.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని