Bill Gates: ఆటలో సరికొత్త చరిత్ర.. ముంబయి బాలుడిని అభినందిస్తూ బిల్‌గేట్స్‌ ట్వీట్‌

ట్రాన్స్‌నేషనల్ బ్రిడ్జ్ ఛాంపియన్‌షిప్‌ గెలిచి సరికొత్త చరిత్ర సృష్టించిన ముంబయి బాలుడు అన్షుల్ భట్‌ను మైక్రోసాఫ్ట్‌ సహ వ్యవస్థాపకుడు బిల్‌గేట్స్‌ అభినందించారు. ఈ ఆట తనుకు ఇష్టమని తెలిపారు.

Published : 01 Oct 2022 17:22 IST

ఇంటర్నెట్‌ డెస్క్‌: ట్రాన్స్‌నేషనల్ బ్రిడ్జ్ ఛాంపియన్‌షిప్‌(కార్డ్స్‌తో ఆడే ఆట)లో చరిత్ర సృష్టించిన ముంబయి బాలుడిని అభినందిస్తూ మైక్రోసాఫ్ట్‌ సహ వ్యవస్థాపకుడు బిల్‌గేట్స్‌ ట్వీట్‌ చేశారు. కాలక్షేపం కోసం తాను ఇదే ఆట ఆడతానని, కొత్త ఛాంపియన్‌ గురించి తెలుసుకున్నందుకు ఆనందంగా ఉందని వెల్లడించారు. ఇటలీలో ఆగస్టులో జరిగిన ట్రాన్స్‌నేషనల్ బ్రిడ్జ్ ఛాంపియన్‌షిప్‌ అండర్‌-16 విభాగంలో ముంబయికి చెందిన అన్షుల్ భట్‌ టైటిల్‌ సాధించి.. కప్‌ గెలిచిన అతి పిన్న వయస్కుడిగా చరిత్ర సృష్టించాడు. ఓవరాల్‌ ఛాంపియన్‌ షిప్‌తోపాటు మరో రెండు అవార్డులను కూడా సొంతం చేసుకున్నాడు.

కాగా ఆ బాలుడిని అభినందిస్తూ బిల్‌గేట్స్‌ తాజాగా ఓ ట్వీట్‌ చేశారు. ‘కాలక్షేపం కోసం నేను ఇష్టంగా ఆడే ఆటలో కొత్త యూత్ వరల్డ్ ఛాంపియన్ గురించి మరింత తెలుసుకోవడం చాలా ఆనందంగా ఉంది. ఆలస్యమైనప్పటికీ.. అభినందనలు, అన్షుల్ భట్!’ అంటూ ట్వీట్‌ చేశారు. ఇదిలా ఉంటే.. ఈ టోర్నీకి ముందు అన్షుల్‌కు క్రికెట్‌ దిగ్గజం సచిన్‌ తెందూల్కర్‌ కాల్‌ చేసి మాట్లాడటం విశేషం. ఒత్తిడిని అధిగమించి, లక్ష్యాన్ని ఎలా చేరుకోవాలో సచిన్‌ అతడికి వివరించినట్లు ఓ వార్తాసంస్థ తెలిపింది.

Read latest India News and Telugu News

Follow us on Facebook, Twitter, Instagram & Google News.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

ap-districts
ts-districts

ఎక్కువ మంది చదివినవి (Most Read)

మరిన్ని