ఎర్రకోట వద్ద లేజర్‌ కళ్లు

ప్రధాని జాతీయ జెండాను ఆవిష్కరించడానికి ముందు ఎన్నోరోజుల నుంచే ఎర్రకోట వద్ద అధికారులు అత్యంత కట్టుదిట్టమైన భద్రతా ఏర్పాటు చేస్తుంటారు.

Published : 16 Aug 2020 00:34 IST

దిల్లీ: ప్రధాని జాతీయ జెండాను ఆవిష్కరించడానికి ముందు ఎన్నోరోజుల నుంచే ఎర్రకోట వద్ద అధికారులు అత్యంత కట్టుదిట్టమైన భద్రతా ఏర్పాటు చేస్తుంటారు. దానిలో భాగంగానే ఈసారి భారత్‌లో తయారైన యాంటీ డ్రోన్‌ సిస్టమ్‌ కూడా ప్రధాని మోదీ భద్రతను తన లేజర్‌ కళ్లతో పర్యవేక్షించింది. ఇది వేదిక సమీపంలో ఆకాశం మొత్తాన్ని స్కాన్ చేసి, డ్రోన్ల జాడను పట్టేస్తుంది. డీఆర్‌డీఓ అభివృద్ది చేసిన ఈ లేజర్ ఆయుధం ఎర్రకోటకు సమీపంలోని మూడు కిలో మీటర్ల పరిధిలో తిరుగాడే మైక్రో డ్రోన్లపై కన్నేసింది. ఇది వాటిని గుర్తించి, కదలకుండా చేయగలదు. అలాగే దేశ పశ్చిమ, ఉత్తర సరిహద్దుల్లో ఇటీవల కాలంలో పెరిగిన డ్రోన్‌ కార్యకలాపాలను ఇది సమర్థవంతంగా ఎదుర్కోగలదని వారు వెల్లడించారు. కాగా, దిల్లీలోని ఎర్రకోటపై ప్రధాని మోదీ జాతీయ జెండాను ఆవిష్కరించారు. కొవిడ్‌ నిబంధనలు పాటిస్తూ కార్యక్రమాన్ని నిర్వహించారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని