Delhi Pollution: పంట వ్యర్థాల దహనానికి బాధ్యత మాదే: కేజ్రీవాల్
పంజాబ్‌లోనూ ఆమ్ ఆద్మీ ప్రభుత్వమే ఉందని.. పంట వ్యర్థాల దహనాలకు పూర్తి బాధ్యత తమదేనని దిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ తెలిపారు. దేశ రాజధానిలో కాలుష్య నియంత్రణకు పలు నిర్ణయాలు తీసుకున్నారు.
దిల్లీ: దేశ రాజధాని దిల్లీలో కాలుష్యం నానాటికీ పెరిగిపోతుండటంతో ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. కాలుష్య పరిస్థితుల దృష్ట్యా శనివారం నుంచి ప్రైమరీ స్కూళ్లను మూసివేస్తున్నట్లు దిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ శుక్రవారం ప్రకటించారు. పరిస్థితులు సాధారణ స్థాయికి వచ్చేంతవరకు ఈ మూసివేత కొనసాగుతుందన్నారు. ఐదు, అంతకంటే పైతరగతుల విద్యార్థుల అవుట్డోర్ గేమ్స్‌ను కూడా నిలిపివేస్తున్నామని తెలిపారు. అంతేగాక, ట్రాఫిక్ నియంత్రణకు మరోసారి ‘సరి-బేసి’ని అమలు చేయడం గురించి కూడా ఆలోచిస్తున్నట్లు చెప్పారు.
పంజాబ్‌లోనూ మా ప్రభుత్వమే.. బాధ్యత మాదే..
సరిహద్దు రాష్ట్రాల్లో వ్యవసాయ వ్యర్థాలను పెద్ద ఎత్తున తగలబెడుతుండటంతో దిల్లీలో కాలుష్యం పెరుగుతోంది. ముఖ్యంగా పంజాబ్‌లో ఈ వ్యర్థాల దహనం ఎక్కువగా ఉంటోంది. దీంతో ఆమ్ ఆద్మీ ప్రభుత్వంపై విమర్శలు వ్యక్తమవుతున్నాయి. ఈ క్రమంలో పంజాబ్ ముఖ్యమంత్రి భగవంత్ మాన్‌తో కలిసి కేజ్రీవాల్ నేడు మీడియా సమావేశం నిర్వహించారు. ‘‘వాయు కాలుష్యం అనేది ఉత్తర భారత సమస్య. ఇతర రాష్ట్రాల్లోనూ చాలా ప్రాంతాల్లో తీవ్ర కాలుష్యం నమోదవుతోంది. గాలి నాణ్యత తగ్గడానికి ఒక్క దిల్లీనో.. పంజాబ్ ప్రభుత్వమో కారణం కాదు. ఇది నిందలు వేసేందుకు, రాజకీయాలు చేసేందుకు సమయం కాదు. అయితే పంజాబ్‌లోనూ మా ప్రభుత్వమే ఉంది. అక్కడ పంట వ్యర్థాల దహనాలకు మాదే పూర్తి బాధ్యత. పంజాబ్‌లో మేం అధికారంలోకి వచ్చి కేవలం 6 నెలలే. ఈ కాలంలో అనేక ఇతర సమస్యలపై కూడా దృష్టి పెట్టాల్సి వచ్చింది. అయితే పంట వ్యర్థాల సమస్యపై మేం ఆలోచనలు చేస్తున్నాం. ఒక ఏడాది సమయం ఇవ్వండి. వచ్చే ఏడాది నవంబరు నాటికి ఈ సమస్యకు పూర్తి పరిష్కారం కనుగొంటాం’’ అని కేజ్రీవాల్ తెలిపారు.
దేశ రాజధానిలో కొన్ని రోజులుగా వాయు కాలుష్యం తీవ్ర స్థాయిలో ఉంటోంది. శుక్రవారం ఉదయం చాలా ప్రాంతాల్లో గాలి నాణ్యత సూచీ 450 కంటే ఎక్కువగా నమోదై ‘అత్యంత తీవ్ర’ స్థాయిని సూచిస్తోంది. అత్యధికంగా బవానా ప్రాంతంలో 483గా నమోదైంది. కాలుష్య నియంత్రణకు దిల్లీ ప్రభుత్వం ఇప్పటికే పలు చర్యలు చేపట్టింది. నిర్మాణ పనులపై నిషేధం విధించింది. అటు నోయిడాలోనూ కాలుష్యం తీవ్ర స్థాయికి చేరడంతో ఈ నెల 8వ తేదీ వరకు స్కూళ్లు మూసివేసి ఆన్లైన్ క్లాసులు నిర్వహించాలని అధికారులు నిర్ణయించారు.
ఇవీ చదవండి
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని


తాజా వార్తలు (Latest News)
-
Sports News
Sarfaraz: సర్ఫరాజ్ మా దృష్టిలోనే ఉన్నాడు: బీసీసీఐ
-
Movies News
Athiya-Rahul: అతియా - రాహుల్ పెళ్లి.. ఆ వార్తల్లో నిజం లేదు
-
General News
Balakrishna: చికిత్స కోసం తారకరత్నను బెంగళూరు తరలిస్తాం: బాలకృష్ణ
-
Politics News
Congress: ‘భద్రతా సిబ్బంది మాయం..’ రాహుల్ పాదయాత్ర నిలిపివేత!
-
World News
Raja Chari: మన రాజాచారి మరో ఘనత.. అమెరికా ఎయిర్‌ఫోర్స్‌లో కీలక పదవి..!
-
General News
Pariksha Pe Charcha: మోదీకి తెలంగాణ విద్యార్థిని ప్రశ్న.. నివృత్తి చేసిన ప్రధాని