Haryana: మత మార్పిడి నిరోధక చట్టం అమలుకు సిద్ధమవుతున్న హరియాణా!

బలవంతపు మతమార్పిడిని నిషేధిస్తూ ఉత్తరప్రదేశ్‌, మధ్యప్రదేశ్‌లో మతమార్పిడి నిరోధక చట్టాల్ని అమలు చేస్తున్న విషయం తెలిసిందే. ఇప్పుడు హరియాణా రాష్ట్రం కూడా అదే బాటలో నడిచేందుకు సిద్ధమవుతోంది. తాజాగా ‘హరియాణా ప్రివెన్షన్‌ ఆఫ్‌ అన్‌లాఫుల్‌ కన్వర్షన్‌

Published : 09 Feb 2022 01:27 IST

చండీగఢ్‌: బలవంతపు మతమార్పిడిని నిషేధిస్తూ ఉత్తరప్రదేశ్‌, మధ్యప్రదేశ్‌లో మతమార్పిడి నిరోధక చట్టాల్ని అమలు చేస్తున్న విషయం తెలిసిందే. హరియాణా కూడా అదే బాటలో నడిచేందుకు సిద్ధమవుతోంది. తాజాగా ‘హరియాణా ప్రివెన్షన్‌ ఆఫ్‌ అన్‌లాఫుల్‌ కన్వర్షన్‌ ఆఫ్‌ రిలీజియస్‌ బిల్లు, 2022’ ముసాయిదాకు రాష్ట్రమంత్రి వర్గం ఆమోదం తెలిపింది. మార్చి 2న జరిగే రాష్ట్ర అసెంబ్లీ బడ్జెట్‌ సమావేశాల్లోనే ఈ బిల్లును ఆమోదించనున్నారు.

ఈ బిల్లుపై హరియాణా విద్యాశాఖ మంత్రి కన్వర్‌ పాల్‌ మాట్లాడుతూ రాష్ట్రంలో బలవంతపు మతమార్పిడిలకు సంబంధించి పోలీస్‌ స్టేషన్లలో ఎక్కువగా కేసులు నమోదవుతున్నాయని, ఈ నేపథ్యంలోనే మత మార్పిడిలను నిషేధిస్తూ రాష్ట్ర ప్రభుత్వం ఈ చట్టాన్ని తీసుకొస్తోందని చెప్పారు. ఎవరైనా బలవంతంగా మతం మార్పించాలని ప్రయత్నిస్తే వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. మతాన్ని గురించి తెలియకుండా నకిలీ పేర్లు పెట్టుకొని మతాంతర వివాహాలు చేసుకున్నా.. శిక్షార్హులవుతారని మంత్రి పాల్‌ వెల్లడించారు. మరోవైపు కర్ణాటక ప్రభుత్వం కూడా మతమార్పడి నిరోధక చట్టాన్ని అమలు చేసే ప్రయత్నంలో ఉన్న విషయం తెలిసిందే.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని