Antibiotics: కొవిడ్ కేసుల పెరుగుదల వేళ.. యాంటిబయాటిక్స్‌పై కేంద్రం మార్గదర్శకాలు
కొవిడ్ (Covid) సమయంలో యాంటీబయాటిక్స్ (Antibiotics) వినియోగం విపరీతంగా పెరిగింది. తాజాగా మళ్లీ దేశంలో కరోనా కేసులు పెరుగుతున్న వేళ.. ఈ ఔషధాల వినియోగంపై కేంద్రం మార్గదర్శకాలను సవరించింది.
దిల్లీ: ఇన్‌ఫ్లుయెంజా భయాల వేళ దేశవ్యాప్తంగా కొవిడ్ కేసులు మళ్లీ పెరుగుతుండటం ఆందోళన కలిగిస్తోంది. ఈ క్రమంలోనే కొవిడ్ (Covid 19) బాధితుల చికిత్సకు కేంద్రం మార్గదర్శకాలను సవరించింది. కొవిడ్ బాధితుల్లో బ్యాక్టీరియల్ ఇన్ఫెక్షన్ (bacterial infection)ను గుర్తిస్తేనే యాంటీబయాటిక్స్ (Antibiotics) చికిత్సలో ఉపయోగించాలని వైద్యులకు సూచించింది. అంతేగాక, అజిత్రోమైసిన్ (Azithromycin), ఐవర్‌మెక్టిన్ వంటి ఔషధాలను కూడా ఉపయోగించవద్దని స్పష్టం చేసింది.
‘‘ఇతర అంటువ్యాధుల వ్యాప్తితో కొవిడ్ (Covid 19) సోకే ప్రమాదాన్ని తప్పనిసరిగా పరిగణనలోకి తీసుకోవాలి. కొవిడ్ బాధితుల్లో బ్యాక్టీరియల్ ఇన్ఫెక్షన్ సోకినట్లు క్లినికల్‌గా లక్షణాలు కన్పిస్తేనే యాంటీబయాటిక్స్ (Antibiotics)ను వాడాలి. లేదంటే వాటి అవసరం లేదు. పినవిర్-రిటోనవిర్, హైడ్రోక్లోరోక్విన్, ఐవర్‌మెక్టిన్, మోల్నుపిరావిర్, ఫావిపిరావిర్, అజిత్రోమైసిన్ (Azithromycin), డాక్సీసైక్లిన్ వంటివి కొవిడ్ చికిత్సలో ఉపయోగించకూడదు. కొవిడ్ తీవ్రత ఎక్కువగా ఉన్న బాధితులకు ఐదురోజుల పాటు రెమిడెసివిర్ ఇవ్వొచ్చు’’ అని కేంద్రం ఆ మార్గదర్శకాల్లో స్పష్టం చేసింది.
దేశంలో కరోనా (Corona Virus) కేసులు మళ్లీ పెరుగుతున్నాయి. ఆదివారం దేశవ్యాప్తంగా వెయ్యికి పైగా కేసులు నమోదవ్వగా.. సోమవారం 918 కొత్త కేసులు వెలుగుచూశాయి. అటు యాక్టివ్ కేసులు కూడా 6,350కి చేరాయి.
ఇవీ చదవండి
గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని


తాజా వార్తలు (Latest News)
-
World News
82 ఏళ్ల వయసులో తండ్రి కాబోతున్న అల్ పాసినో
-
World News
‘బ్లూటూత్’తో మెదడు, వెన్నెముకల అనుసంధానం!.. నడుస్తున్న పక్షవాత బాధితుడు
-
Ap-top-news News
తిరుపతి జూలో పులి పిల్ల మృతి.. నిర్వాహకుల నిర్లక్ష్యమే కారణమా!
-
Ap-top-news News
అవినాష్ తల్లికి శస్త్రచికిత్స జరగలేదు.. చర్యలు తీసుకోండి
-
Ts-top-news News
వనపర్తి జిల్లాలో ఇనుము ఉత్పత్తి క్షేత్రం ఆనవాళ్లు
-
Ts-top-news News
అభివృద్ధిపై ప్రశ్నించినందుకు ఎమ్మెల్యే ఆగ్రహం.. వృద్ధురాలి పింఛన్ తొలగింపునకూ ఆదేశం