CBSE: పరీక్షలు రద్దు చేయాలని కేజ్రీవాల్‌ విజ్ఞప్తి

సీబీఎస్‌ఈ బోర్డు 12వ తరగతి పరీక్షలు రద్దు చేయాలని కేంద్ర ప్రభుత్వానికి విజ్ఞప్తి చేసినట్టు దిల్లీ సీఎం అరవింద్‌ కేజ్రీవాల్‌ వెల్లడించారు.....

Published : 01 Jun 2021 16:38 IST

దిల్లీ: సీబీఎస్‌ఈ బోర్డు 12వ తరగతి పరీక్షలు రద్దు చేయాలని కేంద్ర ప్రభుత్వానికి విజ్ఞప్తి చేసినట్టు దిల్లీ సీఎం అరవింద్‌ కేజ్రీవాల్‌ వెల్లడించారు. గత పనితీరు ఆధారంగా విద్యార్థులను ఎవాల్యుయేట్‌ చేయాలని కోరినట్టు తెలిపారు. ఈ మేరకు మంగళవారం సాయంత్రం కేజ్రీవాల్‌ ట్విట్‌ చేశారు. కరోనా మహమ్మారి నేపథ్యంలో విద్యార్థులు, వారి తల్లిదండ్రులు 12వ తరగతి పరీక్షల గురించి తీవ్ర ఆందోళన వ్యక్తంచేస్తున్నారని పేర్కొన్నారు. వ్యాక్సినేషన్‌ లేకుండా పరీక్షలు నిర్వహించరాదని వారు కోరుకుంటున్నారని తెలిపారు. ఈ నేపథ్యంలో సీబీఎస్‌ఈ బోర్డు 12వ తరగతి పరీక్షలను రద్దు చేయాలని కేంద్రానికి విజ్ఞప్తి చేసినట్టు కేజ్రీవాల్‌ పేర్కొన్నారు.

మరోవైపు, సీబీఎస్‌ఈ 12వ తరగతి పరీక్షల నిర్వహణ అంశంపై చర్చించేందుకు ప్రధాని నరేంద్ర మోదీ అధ్యక్షతన కీలక భేటీ జరగడానికి ముందు కేజ్రీవాల్‌ ఈ ట్వీట్‌ చేయడం గమనార్హం. కరోనా ఉద్ధృతి నేపథ్యంలో ఏప్రిల్‌ 14న సీబీఎస్‌ఈ 10 తరగతి పరీక్షలు రద్దు చేసిన అధికారులు.. 12వ తరగతి పరీక్షలను వాయిదా వేసిన విషయం తెలిసిందే.  ఈ పరీక్షల నిర్వహణపై ఇటీవల కేంద్ర విద్యాశాఖ అన్ని రాష్ట్రాలతో సంప్రదింపులు జరిపి అభిప్రాయాలు కోరింది. ఆ వివరాలు, పరీక్షల నిర్వహణకు ఉన్న అవకాశాలను అధికారులు ప్రధానికి వివరించనున్నారు. ఈ సమావేశంలో సీబీఎస్‌ఈ పరీక్షలపై ఓ నిర్ణయం తీసుకొనే అవకాశం ఉంది.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని