Published : 24 May 2022 16:50 IST

Kejriwal: మాన్‌.. నిన్ను చూసి గర్విస్తున్నా.. ఆ నిర్ణయంతో కన్నీళ్లొచ్చాయ్‌!

దిల్లీ ముఖ్యమంత్రి అరవింద్‌ కేజ్రీవాల్‌

దిల్లీ: అవినీతి ఆరోపణలు రావడంతో పంజాబ్‌ ఆరోగ్య మంత్రి విజయ్‌సింగ్లాను కేబినెట్‌ నుంచి తొలగించడంపై ఆప్‌ జాతీయ కన్వీనర్‌, దిల్లీ సీఎం అరవింద్‌ కేజ్రీవాల్‌ స్పందించారు. ఈ సమయంలో సీఎం భగవంత్‌ మాన్‌ తీసుకున్న నిర్ణయం తనకు కన్నీళ్లు తెప్పించిందన్నారు. ఆరోగ్యమంత్రిపై వేటు వేస్తున్నట్లు భగవంత్‌ మాన్‌ చేసిన ప్రకటనపై కేజ్రీవాల్‌ ట్విటర్‌లో స్పందించారు. ‘భగవంత్‌ మాన్‌ను చూసి గర్వపడుతున్నా. మీరు తీసుకున్న చర్యలు నాకు కన్నీళ్లు తెప్పించాయి. ఆమ్‌ ఆద్మీని చూసి యావత్‌ భారతదేశం నేడు గర్వపడుతోంది’ అని ప్రశంసించారు.

మరోవైపు కేజ్రీవాల్ ‘అవినీతి నిరోధక నమూనా’కు అనుగుణంగానే ఆరోపణలు వచ్చిన వెంటనే మంత్రిని తొలగిస్తూ పంజాబ్‌ సీఎం నిర్ణయం తీసుకున్నారని ఆప్ ఎంపీ రాఘవ్ చద్దా పేర్కొన్నారు. అవినీతి ఆరోపణలపై సొంత పార్టీ నేతలపైనే చర్యలు తీసుకునే చిత్తశుద్ధి, ధైర్యం ఉన్న ఏకైక పార్టీ ఆమ్‌ఆద్మీ పార్టీ మాత్రమేనన్నారు. ‘ఇదివరకు దిల్లీలో చూశాం. ఇప్పుడు పంజాబ్‌లో చూస్తున్నాం. అవినీతిని సహించేదే లేదు. సీఎం మాన్‌ తీసుకున్న నిర్ణయం అభినందనీయం' అని ట్విటర్‌లో పేర్కొన్నారు.

ఇదిలాఉంటే, పంజాబ్‌ ఆరోగ్య మంత్రి విజయ్‌ సింగ్లాపై అవినీతి ఆరోపణలు రావడంతో ఆయనను మంత్రివర్గం నుంచి తొలగిస్తున్నట్లు ముఖ్యమంత్రి భగవంత్‌ మాన్‌ ప్రకటించారు. అంతేకాకుండా ఆయనపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేయాలని పోలీసులను ఆదేశించారు. దీంతో రంగంలోకి దిగిన అవినీతి నిరోధకశాఖ అధికారులు మంత్రిని అరెస్టు చేశారు. పంజాబ్‌లో కొత్తగా కొలువుదీరిన ప్రభుత్వంలో ఆరోగ్యమంత్రిగా బాధ్యతలు స్వీకరించి రెండు నెలలు గడవకముందే అవినీతి ఆరోపణలతో ఓ మంత్రి పదవి పోగొట్టుకోవడంతోపాటు అరెస్టు కావడం గమనార్హం.

Read latest India News and Telugu News

 Follow us on Facebook, Twitter, Instagram, Koo, ShareChat and Google News.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సు సాంకేతికతతో పంపబడతాయి. ఏ ప్రకటనని అయినా పాఠకులు తగినంత జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

మరిన్ని