మోదీ పర్యటన వేళ.. ఆయుధాలు స్వాధీనం!

అసోంలోని కోక్రాఝర్‌ జిల్లాలో ప్రధాని మోదీ పర్యటనకు ముందు ఆయుధాలు బయటపడటం కలకలం సృష్టించింది. జిల్లాలోని గొస్సయిగావ్‌ ప్రాంతంలో పోలీసులు సోమవారం ఆయుధ సామగ్రిని స్వాధీనం చేసుకున్నారు.

Published : 30 Mar 2021 12:29 IST

గువహటి: అసోంలోని కోక్రాఝర్‌ జిల్లాలో ప్రధాని మోదీ పర్యటనకు ముందు ఆయుధాలు బయటపడటం కలకలం సృష్టించింది. జిల్లాలోని గొస్సయిగావ్‌ ప్రాంతంలో పోలీసులు సోమవారం ఆయుధ సామగ్రిని స్వాధీనం చేసుకున్నారు. ఎన్నికల ప్రచారం నిమిత్తం ప్రధాని మోదీ ఏప్రిల్‌ 1న జిల్లా పర్యటనకు రానున్నారు. ‘జిల్లాలో సోదాలు నిర్వహిస్తున్న సమయంలో మూడు ఏకే56 రైఫిల్స్‌, మరో మూడు ఏకే 56 మ్యాగ్జిన్లు కనుగొన్నాం. వాటితో పాటు 157 రౌండ్ల బుల్లెట్లను సైతం స్వాధీనం చేసుకున్నాం. ఈ ఆయుధాలు ఎక్కడి నుంచి వచ్చాయనే విషయంపై విచారణ చేపట్టాం’ అని పోలీసులు తెలిపారు.

అసోం అదనపు డీజీపీ ఎల్‌ఆర్‌ బిష్ణోయ్‌ మాట్లాడుతూ.. ‘ఏప్రిల్‌ 1న ప్రధాని మోదీ కోక్రఝర్‌లో పర్యటించనున్నారు. జిల్లావ్యాప్తంగా భారీ భద్రతా ఏర్పాట్లు చేశాం. ఎవరో గుర్తుతెలియని వ్యక్తులు అటవీ ప్రాంతంలో ఏదో కుట్రకు తెరతీసి ఉంటారని అనుమానిస్తున్నాం. వారి ప్రణాళిక ఏంటనే విషయం తెలియదు. గొస్సాయిగావ్‌ ప్రాంతంలో పోలీసులు చేపట్టిన తనిఖీల్లో భాగంగా ఆయుధాలను స్వాధీనం చేసుకున్నాం’ అని తెలిపారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని