తెలంగాణ, మహారాష్ట్రలో విధ్వంసానికి ఉగ్రవాదుల కుట్ర..!

దేశవ్యాప్తంగా పలు చోట్ల భీకర పేలుళ్లకు ముష్కరులు పన్నిన కుట్రను పోలీసులు భగ్నం చేశారు. భారీ మొత్తంలో ఆయుధాలు, పేలుడు పదార్థాలు తెలంగాణకు తరలించేందుకు యత్నించినర నలుగురు ఖలీస్థానీ

Updated : 05 May 2022 15:18 IST

హరియాణాలో నలుగురి అరెస్టు.. భారీగా పేలుడు పదార్థాల స్వాధీనం

చండీగఢ్‌: దేశవ్యాప్తంగా పలు చోట్ల భీకర పేలుళ్లకు ముష్కరులు పన్నిన కుట్రను పోలీసులు భగ్నం చేశారు. భారీ మొత్తంలో ఆయుధాలు, పేలుడు పదార్థాలు తెలంగాణకు తరలించేందుకు యత్నించిన నలుగురు ఖలీస్థానీ ఉగ్రవాదులను ఈ ఉదయం అరెస్టు చేశారు. వీరికి పాకిస్థాన్‌తో సంబంధాలు ఉన్నట్లు తెలుస్తోంది.

నిఘా వర్గాల సమాచారం మేరకు తెలంగాణ, పంజాబ్‌, హరియాణా పోలీసులు సంయుక్త అంతర్రాష్ట్ర ఆపరేషన్‌ చేపట్టారు. ఈ క్రమంలో హరియాణాలోని కర్నాల్‌ ప్రాంతంలో ఓ టోల్‌ ప్లాజా వద్ద అనుమానిత ఇన్నోవా ఎస్‌యూవీని అధికారులు గుర్తించారు. ఆ వాహనాన్ని తనిఖీ చేయగా.. భారీ ఎత్తున ఆయుధాలు కన్పించాయి. ఇందులో ఐఈడీలు, ఆర్డీఎక్స్‌, 30 కాలిబర్‌ పిస్టళ్లు కూడా ఉన్నాయి. దీంతో వాహనంలోని నలుగురు వ్యక్తులను అరెస్టు చేశారు. పంజాబ్‌కు చెందిన వీరిని ఖలిస్థానీ ఉగ్రవాదులుగా అనుమానిస్తున్నారు. ఈ అయుధాలను తెలంగాణ, మహారాష్ట్రకు తరలించేందుకు తీసుకెళ్తున్నట్లు అధికారులు తెలిపారు.

వీరిని విచారించగా అనేక కీలక విషయాలు బయటపడ్డాయి. ఈ ఆయుధాలను డ్రోన్ల ద్వారా దేశ సరిహద్దుల నుంచి తీసుకున్నట్లు తెలిపారు. వీటిని దేశంలోని వివిధ ప్రాంతాలకు తరలిస్తున్నామని నిందితులు చెప్పినట్లు తెలుస్తోంది. పాకిస్థాన్‌కు చెందిన ఖలిస్థానీ ఉగ్రవాది హర్జిందర్‌ సింగ్‌ రిండా వీటిని పంపినట్లు అధికారులు తెలిపారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని