Updated : 09/12/2021 14:45 IST

Bipin Rawat: సైన్యంలో దిశా నిర్దేశకుల ప్రాణాలకు అత్యంత విలువ..!

 హెలికాప్టర్‌ ప్రయాణంపై అందుకే ఆంక్షలు..

ఇంటర్నెట్‌డెస్క్‌ ప్రత్యేకం

ఈ ఏడాది ధ్రువ్‌ అడ్వాన్స్‌డ్‌ లైట్‌ హెలికాప్టర్‌ హఠాత్తుగా గుజరాత్‌లోని ఖేడ్‌ జిల్లా వద్ద ఎమర్జెన్సీ ల్యాండింగ్‌ అయ్యింది. ఆర్మీ ట్రైనింగ్‌ కమాండ్‌ అధిపతి లెఫ్టినెంట్‌ జనరల్‌ రాజ్‌శుక్లా, వాయుసేన సౌత్‌వెస్ట్రన్‌ కమాండ్‌ అధిపతి ఎయిర్‌ మార్షల్‌ సురేంద్ర కుమార్‌ దానిలో ప్రయాణిస్తున్నారు. వీరు గుజరాత్‌ కెవడియాలో జరుగుతున్న కంబైన్డ్‌ కమాండర్స్‌ సదస్సుకు వెళుతున్నారు. హెలికాప్టర్‌లో సమస్య రావడంతో వారిని వేరే మార్గంలో గమ్య స్థానాలకు చేర్చారు. అత్యున్నత స్థాయి 3స్టార్‌ కమాండర్లను ఒకే హెలికాప్టర్‌లో పంపడంపై అప్పట్లో రక్షణశాఖపై తీవ్ర విమర్శలు వచ్చాయి. చివరికి ఆర్మీ సంతృప్తికర వివరణ ఇవ్వడంతో వివాదం సద్దుమణిగింది.

త్రివిధ దళాధిపతి బిపిన్‌ రావత్‌ ఆకస్మిక మృతి భారత సైన్యానికి తీరని లోటు. ప్రభుత్వం/ప్రముఖ సంస్థల్లో పనిచేసే వ్యూహకర్తల భద్రతకు ప్రథమ ప్రాధాన్యం ఉంటంది. మరీ ముఖ్యంగా భారత సైన్యంలో ప్రాణానికి అత్యంత విలువనిస్తారు. అదే సమయంలో కొన్ని వేల మందికి సరైనా దిశా నిర్దేశం చేయగలిగే వ్యక్తి ప్రాణాలకు మరింత విలువ ఉంటుంది. అందుకే టాప్‌ జనరల్స్‌ రక్షణ విషయంలో ప్రభుత్వం ఎక్కడా రాజీపడదు. ఎందుకంటే సైన్యాన్ని నడిపించే వ్యూహకర్తలు వీరే. ఒక మంచి వ్యూహకర్తను కోల్పోవడం అంటే.. ఆ మేరకు ఆపరేషన్‌ నిర్వహణ శక్తి దెబ్బతిన్నట్లే లెక్క. అందుకే భారత్‌లో ఇద్దరు 3స్టార్‌ జనరల్స్‌ కలిసి ఒకే సింగిల్‌ ఇంజిన్‌ హెలికాప్టర్‌లో ప్రయాణించరు. ఇది భారత ఆర్మీ ప్రొటోకాల్స్‌కు విరుద్ధం. ఖేడ్‌ఘటనలో వాడిన ధ్రువ్‌ హెలికాప్టర్‌ ట్విన్‌ ఇంజిన్‌ది కావడంతో సైన్యం ఆ విషయాన్ని మీడియాకు వెల్లడించింది.

సింగల్‌ ఇంజిన్‌ హెలికాప్టర్‌పై ఎందుకు ఆంక్షలు..?

1963 నవంబర్‌ 22వ తేదీన జరిగిన ఓ ఘోర ప్రమాదం భారత సైన్యానికి గట్టి హెచ్చరికలా పనిచేసింది. దేశంలోని అత్యంత సీనియర్‌ జనరల్స్‌ ఆరుగురు ఈ ప్రమాదంలో మరణించారు. కశ్మీర్‌లోని పూంచ్‌కు వచ్చే నీరు, విద్యుత్తు వంటి వాటిని  దెబ్బతీసేందుకు పాక్‌ దళాలు ఆక్రమిత కశ్మీర్‌లోని ఒక డ్యామ్‌ను పేల్చివేశాయి. దీంతో సైన్యం మరోకటి నిర్మాణం చేపట్టింది. దీనిని పరిశీలించేందుకు  నాటి వెస్ట్రన్‌ కమాండ్‌ చీఫ్‌ లెఫ్టినెంట్‌ జనరల్‌ దౌలత్‌ సింగ్‌, ఎయిర్‌ వైస్‌ చీఫ్‌ మార్షల్‌ ఈడబ్ల్యూ పింటో, వెస్ట్రన్‌ కమాండ్‌ ఎయిర్‌ ఆఫీసర్‌ కమాండ్‌  లెఫ్టినెంట్‌ జనరల్‌ బిక్రమ్‌ సింగ్‌, 15వ కోర్‌ జీవోసీ మేజర్‌ జనరల్‌ కేఎన్‌డీ నానావతి, జనరల్‌ ఆఫీసర్‌ 25 ఇన్‌ఫ్రాంట్రీ డివిజన్‌ బ్రిగేడియర్‌ ఎస్‌ఆర్‌ ఒబెరాయ్‌, ఫ్లైట్‌ లెఫ్టినెంట్‌ ఎస్‌.ఎస్‌.సిద్ధూ కలిసి సింగిల్‌ ఇంజిన్‌ విమానమైన చేతక్‌లో బయల్దేరి వెళ్లారు. ఆ విమానం టెలిఫోన్‌ వైర్లను తాకి పూంచ్‌లో ప్రమాదానికి గురైంది. ఈ ఘటనలో ఆరుగురు అధికారులూ చనిపోయారు.  అదే రోజు అప్పటి అమెరికా అధ్యక్షుడు జాన్‌ ఎఫ్‌ కెన్నడీ హత్యకు గురికావంతో ఈ వార్త మీడియా దృష్టిని పెద్దగా ఆకర్షించలేదు. అయితే.. భారత ప్రభుత్వం ఈ ప్రమాదం అనంతరం టాప్‌ జనరల్స్‌ ప్రయాణాల ప్రొటోకాల్‌పై కఠిన నిబంధనలు తీసుకొచ్చింది.

* 1997లో అరుణాచల్‌ ప్రదేశ్‌లో జరిగిన ప్రమాదంలో కూడా రక్షణ బలగాలకు గట్టి దెబ్బతగిలింది. అరుణాచల్‌ ప్రదేశ్‌లోని లుంగార్‌ సెక్టార్‌లో చోటు చేసుకొన్న ఈ ప్రమాదంలో రక్షణ శాఖ సహాయ మంత్రి ఎన్‌.వి.ఎన్‌ సోము, ఫోర్‌ మౌంటేన్‌ డివిజన్‌ కమాండింగ్‌ ఆఫీసర్‌ మేజర్‌ జనరల్‌ ఆర్‌సీ నాగ్‌పాల్‌ సహా మరో ఇద్దరు మేజర్లు చనిపోయారు.

Read latest India News and Telugu News

 Follow us on Facebook, Twitter, Instagram, Koo, ShareChat and Google News. Subscribe our Telegram Channel.

Advertisement

Tags :

మరిన్ని

జిల్లా వార్తలు

సినిమా

మరిన్ని

బిజినెస్

మరిన్ని

క్రీడలు

మరిన్ని

పాలిటిక్స్

మరిన్ని

వెబ్ ప్రత్యేకం

మరిన్ని

జనరల్

మరిన్ని