Agnipath: ఆర్మీ, నేవీలో ‘అగ్నిపథ్‌’ రిజిస్ట్రేషన్లు మొదలయ్యాయ్‌..!

కేంద్ర ప్రభుత్వం కొత్తగా ప్రవేశపెట్టిన అగ్నిపథ్‌ పథకంలో ఆర్మీ, నేవీల్లో నియామక ప్రక్రియ మొదలైందని రక్షణ మంత్రిత్వశాఖ వెల్లడించింది.......

Published : 01 Jul 2022 22:40 IST

దిల్లీ: కేంద్ర ప్రభుత్వం కొత్తగా ప్రవేశపెట్టిన అగ్నిపథ్‌ పథకంలో భాగంగా ఆర్మీ, నేవీల్లో నియామక ప్రక్రియ మొదలైందని రక్షణ మంత్రిత్వశాఖ వెల్లడించింది. వాయుసేనలో రిజిస్ట్రేషన్లు ఇప్పటికే కొనసాగుతుండగా.. ఆర్మీ, నేవీకి సంబంధించి జులై 1 నుంచి ప్రారంభమైనట్టు తెలిపింది. వాయుసేనలో ఈ పథకం కింద గురువారం వరకు దాదాపు 2.72 లక్షల దరఖాస్తులు వచ్చినట్టు మంత్రిత్వశాఖ పేర్కొంది. 

‘‘భారత సైన్యంలో చేరండి. అగ్నివీర్‌గా దేశానికి సేవలందించాన్న మీ కలను సాకారం చేసుకోండి రిజిస్ట్రేషన్లు నేటి నుంచే ప్రారంభమయ్యాయి’’ అని రక్షణమంత్రిత్వశాఖ పేర్కొంది. అగ్నిపథ్‌ పథకం కింద 17.5 సంవత్సరాల నుంచి 23 ఏళ్ల వయసు కలిగిన యువతను అర్హులుగా ప్రకటించిన కేంద్ర ప్రభుత్వం.. నాలుగేళ్ల సర్వీసుపై పనిచేయాల్సి ఉంటుందని స్పష్టంచేసింది. వీరిలో 25శాతం మందిని శాశ్వత ప్రాతిపదికన మళ్లీ సర్వీసులోకి తీసుకుంటామంది. నాలుగేళ్ల తర్వాత బయటకు వచ్చే అగ్నివీరులకు (Agniveers) రక్షణశాఖ, కేంద్ర సాయుధ బలగాల నియామకాల్లోనూ 10 శాతం చొప్పున రిజర్వేషన్లు కల్పిస్తామని ఇప్పటికే స్పష్టం చేసింది.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని