Army: కృత్రిమ మేధ వాహనాలకు త్వరలో భారత సైన్యం పరీక్షలు..!

భారత సైన్యం త్వరలో కృత్రిమ మేధతో పనిచేసే వాహనాలను పరీక్షించనుంది. ఈ పరీక్షలు లద్దాఖ్‌లో జరగనున్నాయి. వీటిని నిఘా, సరఫరాల తరలింపు నిమిత్తం వినియోగించే అవకాశం ఉన్నట్లు కథనాలు వెలువడుతున్నాయి.

Published : 12 Jul 2022 19:28 IST

ఇంటర్నెట్‌డెస్క్‌: భారత సైన్యం త్వరలో కృత్రిమ మేధతో పనిచేసే వాహనాలను పరీక్షించనుంది. ఈ పరీక్షలు లద్దాఖ్‌లో జరగనున్నాయి. వీటిని నిఘా, సరఫరాల తరలింపు నిమిత్తం వినియోగించే అవకాశం ఉన్నట్లు కథనాలు వెలువడుతున్నాయి. ఆ తర్వాత వీటిని రాజస్థాన్‌ ఎడారిలో కూడా పరీక్షించి.. ఆ పై విశ్లేషించిన తర్వాత సైన్యం తుది నిర్ణయం తీసుకోనుంది. భవిష్యత్తులో సైన్యం ఇటువంటి వాహనాలను పెద్ద ఎత్తున కొనుగోలు చేయనుంది.

ప్రస్తుతం ఆర్మీ పరీక్షించనున్న వాహనాల్లో ఒక దానిని కల్యాణీ గ్రూప్‌ అభివృద్ధి చేసింది. ఈ వాహనం బ్యాటరీలు, మోటార్ల సాయంతో నడవగలదు. సోమవారం దిల్లీలో జరిగిన రక్షణ శాఖ సిఫోజియంలో ప్రదర్శించిన 75 ఉత్పత్తుల్లో ఈ వాహనాలు కూడా ఉన్నాయి. ఈ వాహనాలను 3 కిలోమీటర్ల ఆపరేషనల్‌ రేంజిలో బ్యాటరీ సాయంతో ఆరు గంటలపాటు, మోటార్ల సాయంతో 14 గంటలపాటు నడపవచ్చు. దాదాపు 500 కిలోల బరువును ఇవి మోయగలవు. 

ఈ వాహనాలకు డే అండ్‌ నైట్‌ కెమేరాలు కూడా అమర్చిఉన్నాయి. ఇవి రెండు కిలోమీటర్ల దూరంలో ఏం జరుగుతోందో స్పష్టంగా చూడగలవు. ఇప్పటికే ఈ వాహనాలను ఇన్‌ఫాంట్రీ, ఆర్మర్డ్ యూనిట్లు పరీక్షించినట్లు సమాచారం. ఇన్‌ఫాంట్రీ బృందాలు ఈ వాహనాలతో ఆయుధాలు, మందుగుండు సరఫరాను పరీక్షించాయి. ఆర్మర్డ్‌ యూనిట్లు మాత్రం నిఘా అవసరాలను ఎంత మేరకు తీర్చగలవు అనే అంశంపై దృష్టిపెట్టాయి. 

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని