Jammu and Kashmir: జమ్మూకశ్మీర్‌లో ఆర్మీ కాన్వాయ్‌పై ఉగ్రవాదుల దాడి

Terrorist attack: జమ్మూకశ్మీర్‌లోని కథువా జిల్లాలో ఆర్మీ కాన్వాయ్‌పై ఉగ్రవాదులు దాడికి పాల్పడ్డారు. 

Published : 08 Jul 2024 18:01 IST

శ్రీనగర్‌: జమ్మూకశ్మీర్‌(Jammu and Kashmir)లో వరుస ఉగ్రఘటనలు చోటుచేసుకుంటున్నాయి. సోమవారం భారత ఆర్మీ కాన్వాయ్‌పై ఉగ్రవాదులు దాడికి పాల్పడ్డారు. కథువా జిల్లాలోని మాచేడి ప్రాంతంలో జరిగిన ఈ ఘటనలో ఇద్దరు జవాన్లు గాయపడ్డారు. ఇదిలా ఉంటే.. రాజౌరీ వద్ద మాఝకోట్‌ సైనిక శిబిరంపై ఆదివారం తెల్లవారుజామున ఉగ్రవాదులు కాల్పులకు తెగబడ్డారు. ఈ ఘటనలో ఓ సైనికుడికి గాయాలయ్యాయి. సైనికులు ఎదురుకాల్పులు జరపడంతో చీకట్లో ఉగ్రవాదులు పరారయ్యారు. వీరిని పట్టుకోవడానికి సైన్యం గాలింపు చేపట్టింది.

మరోపక్క కుల్గామ్ జిల్లాలో రెండు రోజులుగా రెండు గ్రామాల్లో కొనసాగుతున్న ఎన్‌కౌంటర్లలో ఆరుగురు మృతి చెందారు. శనివారం ప్రారంభమైన ఈ ఎన్‌కౌంటర్లలో ఇద్దరు జవాన్లు అమరులయ్యారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని