Agnipath: జమ్మూకశ్మీర్‌లో ‘అగ్నిపథ్‌’ ర్యాలీ.. భారీగా తరలివచ్చిన యువత

కేంద్ర ప్రభుత్వం కొత్తగా తీసుకొచ్చిన ‘అగ్నిపథ్‌’(Agnipath) పథకం కింద చేపట్టిన సైనిక నియామక ర్యాలీకి జమ్మూ(Jammu)లో విశేష స్పందన లభిస్తోంది. అగ్నివీరుల(Agniveer) నియామకం కోసం చేపట్టిన ర్యాలీకి తొలిరోజే వందలాది మంది యువత తరలివచ్చారు.

Updated : 24 Dec 2022 15:18 IST

జమ్మూ: కేంద్ర ప్రభుత్వం కొత్తగా తీసుకొచ్చిన ‘అగ్నిపథ్‌’(Agnipath) పథకం కింద చేపట్టిన సైనిక నియామక ర్యాలీకి జమ్మూ(Jammu)లో విశేష స్పందన లభిస్తోంది. అగ్నివీరుల (Agniveer) నియామకం కోసం చేపట్టిన ర్యాలీకి తొలిరోజే వందలాది మంది యువత తరలివచ్చారు. జమ్మూలోని జోరవార్‌ స్టేడియంలోని ఆర్మీ రిక్రూట్‌మెంట్‌ కార్యాలయం వద్ద చేపట్టిన ఈ ర్యాలీలో తొలిరోజు సాంబ జిల్లా నుంచి అత్యధికంగా ఔత్సాహిక యువకులు పాల్గొన్నట్టు అధికారులు వెల్లడించారు. ఆర్మీ రిక్రూట్‌మెంట్‌ అక్టోబర్‌ 22వరకు కొనసాగుతుందని చెప్పారు. అయితే, తొలిరోజు ఈ ర్యాలీ షెడ్యూల్‌ ప్రకారం ప్రారంభం కావడానికి ముందే యువత అక్కడికి చేరుకొని తమ ఉత్సాహాన్ని చాటుకున్నారు. 

అగ్నిపథ్‌ పథకంలో భాగంగా ఒక్క ఏడాదైనా సరే.. దేశానికి సేవ చేసేందుకు తాను ఆర్మీలో చేరాలనుకొంటున్నానని ఓ యువకుడు అన్నాడు. తన పేరును చెప్పేందుకు మాత్రం అతడు నిరాకరించాడు. జమ్మూ డిఫెన్స్‌ పీఆర్వో లెఫ్టినెంట్‌ కర్నల్‌ దేవేందర్‌ ఆనంద్‌ మాట్లాడుతూ.. జమ్మూ ప్రావిన్స్‌లోని పది జిల్లాలకు చెందిన ఔత్సాహిక యువత కోసం ఈ ర్యాలీ నిర్వహిస్తున్నట్టు చెప్పారు. సాంబ, కథువా, జమ్మూ, ఉధంపూర్‌, రాజౌరి, పూంచ్‌, రియాసి, రంబన్‌, దుడా, కిస్త్‌వార్ జిల్లాలకు గాను జమ్మూ డివిజన్‌ యువతన ఉంచి అపూర్వ స్పందన వచ్చిందన్నారు. ఈ ర్యాలీని విజయవంతం చేసేందుకు స్థానిక అధికారులతో కలిసి సమన్వయం చేస్తూ అవిశ్రాంతంగా పనిచేస్తున్నామన్నారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని