Indian Army: గల్వాన్‌ వీరులకు బైక్‌ ర్యాలీలతో సైనికుల నివాళి

గల్వాన్‌ లోయలో వీరమరణం పొందిన సైనికులకు భారత సైన్యానికి చెందిన బైకర్స్‌ బృందం ప్రత్యేక నివాళి అర్పించింది.........

Published : 25 Jul 2022 02:58 IST

దిల్లీ: గల్వాన్‌ లోయలో వీరమరణం పొందిన సైనికులకు భారత సైన్యానికి చెందిన బైకర్స్‌ బృందం ప్రత్యేక నివాళి అర్పించింది. ర్యాలీలో భాగంగా నార్తర్న్ కమాండ్ సైనికుల బృందం లద్దాఖ్‌లోని పర్వతాలు, కఠిన ప్రాంతాల గుండా ప్రయాణించించింది. అంతకుముందు లేహ్ సమీపంలోని కరూ వద్ద  నివాళులు అర్పించిన బృందం అక్కడి నుంచి ప్రారంభించింది. శుక్రవారం నాటికి 130 కిలోమీటర్ల మేర ర్యాలీ సాగింది. ఇందుకు సంబంధించిన వీడియోను సైన్యం ట్విటర్‌లో పంచుకుంది. ఆదివారం నాడు ష్యోక్ నది గుండా అఘం, ఖల్సర్ గ్రామాల మీదుగా సుందరమైన నుబ్రా లోయకు ఈ ర్యాలీ చేరుకుంటుంది.

భారత్‌- చైనా సరిహద్దులోని తూర్పు లద్దాఖ్‌ ప్రాంతంలో ఇరు దేశాల సైనికుల మధ్య తీవ్ర ఘర్షణ చోటుచేసుకున్న విషయం తెలిసిందే. 2022 జూన్‌ 16న గల్వాన్‌ లోయ వద్ద చైనా సైన్యం దాడిలో 16 బిహార్‌ రెజిమెంట్‌కు చెందిన 20మంది జవాన్లు ప్రాణాలు కోల్పోయిన ఘటన యావత్‌ దేశాన్ని కలిచివేసింది. దేశం కోసం ప్రాణాలర్పించిన జవాన్లలో సూర్యాపేటకు చెందిన కర్నల్‌ సంతోష్‌బాబు కూడా ఉన్నారు. ఈ ఘర్షణల్లో చైనా వైపు ఎంతమంది ప్రాణాలు కోల్పోయారనే విషయాన్ని డ్రాగన్‌ వెల్లడించకపోయినప్పటికీ.. అమెరికన్‌ ఇంటెలిజెన్స్‌ నివేదిక మాత్రం 35మంది మరణించినట్టు వెల్లడించింది. 38 మంది చనిపోయినట్లు ఆస్ట్రేలియా పత్రిక ‘క్లాక్సన్‌’ సంపాదకుడు క్లాన్‌ పేర్కొన్నారు.


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని