Published : 06 Aug 2022 01:40 IST

Arpita Mukherjee: అర్పితా ముఖర్జీకి ప్రాణహాని.. పరీక్షల తర్వాతే భోజనం, నీరు అందజేత!

కోల్‌కతా: బెంగాల్‌లో ఉపాధ్యాయుల నియామకం కుంభకోణంలో తృణమూల్‌ కాంగ్రెస్‌ మాజీ మంత్రి పార్థా ఛటర్జీ (Partha Chatterjee), ఆయన సన్నిహితురాలు అర్పితా ముఖర్జీ (Arpita Mukherjee) అరెస్టయిన విషయం తెలిసిందే. అయితే, అర్పితా ముఖర్జీకి ప్రాణహాని ఉన్నట్లు ఎన్‌ఫోర్స్‌మెంట్‌ డైరెక్టరేట్‌ (ED) కోర్టుకు వెల్లడించింది. జైలులో ఆమెకు అందించే భోజనం, నీటిని పరీక్షించిన తర్వాతే అందజేయాలని న్యాయస్థానాన్ని కోరింది. ప్రత్యేక బందోబస్తు కల్పించాలంది. ఛటర్జీతోపాటు, అర్పితాకు కోర్టు 14రోజుల జ్యుడీషియల్‌ కస్టడీ విధించిన నేపథ్యంలో ఈడీ కోర్టును కోరింది.

‘అర్పితా ముఖర్జీకి ప్రాణహాని ఉన్నట్లు నిఘా వర్గాల ద్వారా సమాచారం అందింది. పార్థా ఛటర్జీ విషయంలో ఇలాంటి సమాచారం ఏమీలేదు’ అని ఈడీ పేర్కొంది. ‘2012 నవంబర్‌ 1న పార్థా ఛటర్జీ, అర్పితా ముఖర్జీ కలిపి ఓ సంస్థను ఏర్పాటుచేశారు. ఆ సంస్థకు కూడా ఈ మనీలాండరింగ్‌ వ్యవహారంతో సంబంధంపై ఆరా తీస్తున్నాం. వారికి సంబంధించిన 50ఖాతాలను నిశితంగా పరిశీలిస్తున్నాం. అర్పితా ముఖర్జీకి వడ్డించే భోజనం, నీటిని పరీక్షించిన తర్వాతే అందించాలి’ అని దర్యాప్తు సంస్థ తెలిపింది.

ఛటర్జీ విద్యాశాఖ మంత్రిగా ఉండగా బెంగాల్‌ ఉపాధ్యాయ నియామకాల్లో భారీ అక్రమాలు జరిగాయన్న ఆరోపణలు ఉన్నాయి. ఈ నేపథ్యంలోనే ఛటర్జీ ఇంటిపై దాడి చేసిన ఈడీ అధికారులు.. ఆయన సన్నిహితురాలు అర్పితా ముఖర్జీ, వ్యక్తిగత కార్యదర్శిని గత నెల 23వ తేదీన అదుపులోకి తీసుకున్నారు. అనంతరం అర్పిత నివాసాల్లో సోదాలు జరపగా.. దాదాపు రూ.50కోట్ల విలువైన కరెన్సీ నోట్లు, భారీగా బంగారం, కీలక దస్త్రాలను సీజ్‌ చేశారు.

Read latest India News and Telugu News

Follow us on Facebook, Twitter, Instagram, Koo, ShareChat, and Google News.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సు సాంకేతికతతో పంపబడతాయి. ఏ ప్రకటనని అయినా పాఠకులు తగినంత జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

ap-districts
ts-districts

ఎక్కువ మంది చదివినవి (Most Read)

మరిన్ని