దిశ అరెస్టు ప్రజాస్వామ్యంపై దాడి: కేజ్రీవాల్‌

దిశ రవి అరెస్టు ఘటనను దిల్లీ ముఖ్యమంత్రి అరవింద్‌ కేజ్రీవాల్‌ ఖండించారు.

Updated : 15 Feb 2021 12:42 IST

దిశ అరెస్టుపై కేజ్రివాల్‌ స్పందన

దిల్లీ: పర్యావరణ ఉద్యమకారిణి గ్రేటా థన్‌బర్గ్‌ రైతుల ఆందోళనల ప్రణాళిక ‘టూల్‌కిట్’ను షేర్‌ చేసిన కేసులో‌ పర్యావరణ కార్యకర్త దిశ రవిని అరెస్టు చేశారు. కాగా, ఘటనను దిల్లీ ముఖ్యమంత్రి అరవింద్‌ కేజ్రీవాల్‌ ఖండించారు. ఈ అరెస్టు ప్రజాస్వామ్యంపై జరిగిన దాడిగా ఆయన అభివర్ణించారు.

దిల్లీలో జరుగుతున్న రైతుల ఆందోళనలకు సంబంధించిన ‘టూల్‌కిట్’‌ను గ్రేటా థన్‌బర్గ్‌ కొన్నాళ్ల కిందట ట్విటర్‌ ఖాతాలో ఉంచారు. దీనిపై నమోదైన కేసులో బెంగళూరుకు చెందిన దిశ శనివారం అరెస్టయ్యారు. ఈ నేపథ్యంలో ‘‘21 ఏళ్ల దిశ రవి అరెస్టు, భారత ప్రజాస్వామ్యంపై గతంలో ఎన్నడూ లేని విధంగా జరిగిన దాడి. వ్యవసాయదారులకు మద్దతు పలకడం నేరం కాదు’’ అని కేజ్రీవాల్‌ ట్విటర్‌లో ప్రకటించారు.

ఇవీ చదవండి..

థన్‌బర్గ్‌ టూల్‌కిట్‌ కేసులో తొలి అరెస్టు

అంతరిక్షంలోకి మోదీ ఫొటో

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని