Sonusood : పౌరులే.. విద్యార్థులకు కెరీర్‌ గైడెన్స్‌ ఇవొచ్చు

పాఠశాల దశ నుంచి విద్యార్థులకు కెరీర్‌పై అవగాహన కల్పించాలనే ఉద్దేశంతో దిల్లీ ప్రభుత్వం  ‘దేశ్‌ కీ మెంటర్‌’ కార్యక్రమాన్ని సోమవారం ప్రారంభించింది. ఆగస్టునెలలోనే దిల్లీ ముఖ్యమంత్రి అరవింద్‌ కేజ్రీవాల్‌ ఈ కార్యక్రమానికి శ్రీకారం చుట్టారు.

Published : 11 Oct 2021 23:56 IST

దిల్లీ ప్రభుత్వం వినూత్న ఆలోచన
‘దేశ్‌ కీ మెంటర్‌’ పేరుతో కార్యక్రమం ప్రారంభం, ప్రచారకర్తగా నటుడు సోనూసూద్‌ 

దిల్లీ: పాఠశాల దశ నుంచి విద్యార్థులకు కెరీర్‌పై అవగాహన కల్పించాలనే ఉద్దేశంతో దిల్లీ ప్రభుత్వం  ‘దేశ్‌ కీ మెంటర్‌’ కార్యక్రమాన్ని సోమవారం ప్రారంభించింది. ఆగస్టునెలలోనే దిల్లీ ముఖ్యమంత్రి అరవింద్‌ కేజ్రీవాల్‌ ఈ కార్యక్రమానికి శ్రీకారం చుట్టారు. బాలీవుడ్‌ ప్రముఖ నటుడు, కరోనా వేళ రియల్‌ హీరోగా నిలిచిన సోనూసూద్‌ దీని బాధ్యతలు స్వీకరించారు.ఈ సందర్భంగా దిల్లీ సీఎం కేజ్రీవాల్‌ మాట్లాడుతూ.. ‘‘ ఆయా రంగాల్లో తమని తాము నిరూపించుకున్న పౌరులు.. ప్రభుత్వ పాఠశాల విద్యార్థులకు కెరీర్‌ గైడెన్స్‌ ఇవ్వడమే దీని లక్ష్యం. అన్నీ ప్రభుత్వ పాఠశాలల్లోని 1 నుంచి 10వ తరగతి చదువుతున్న విద్యార్థులకు.. మెంటర్లు ప్రతీ వారం ఫొన్‌ ద్వారా 10 నిమిషాలు సలహాలు సూచనలు అందిస్తారు. ఆసక్తి ఉన్న పౌరులు విద్యార్థులకు సాయపడేందుకు వారిని దత్తత తీసుకోవాల్సి ఉంటుంది. విద్యార్థులు సరైన మార్గదర్శకత్వం పొందితే, వారు జీవితంలోని అన్ని రంగాలలో రాణించవచ్చు. ఉపాధ్యాయులు వారు జీవితంలో పోషించే పాత్రను మించేలా..ఇది ఉంటుందని ఆశిస్తున్నాం’’ అన్నారు. నటుడు సోనూసూద్‌ మాట్లాడుతూ.. ‘‘ ‘దేశ్‌ కీ మెంటర్‌’కి బ్రాండ్‌ అంబాసిడర్‌గా పనిచేయడం ఆనందంగా ఉంది. ఈ రోజు లక్షలాది మంది విద్యార్థులకు మార్గనిర్దేశం చేసే అవకాశం నాకు దక్కింది. ఇంతకంటే గొప్పసేవ మరొకటి లేదు. మేం కచ్చితంగా కలిసి పనిచేస్తాం. లాక్‌డౌన్ ప్రారంభమైనప్పటి నుంచి మేం ఎంతో మందిని కలుసుకున్నాం. అప్పుడే చదువు ఒక పెద్ద సమస్యగా ఉందని అర్థమైంది. పిల్లలకు సరైన మార్గనిర్దేశం చేయాల్సిన అవసరం ఉందని గ్రహించాం’’ అని చెప్పారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు