Arvind Kejriwal: మొన్న జైన్‌.. తర్వాత అరెస్టయ్యేది ఈ మంత్రే..!

దిల్లీ ఆరోగ్య శాఖ మంత్రి సత్యేందర్ జైన్‌ అరెస్టు.. భాజపా, ఆమ్‌ ఆద్మీ పార్టీ(ఆప్‌) మధ్య తీవ్రస్థాయి విమర్శలకు దారితీస్తోంది.

Published : 02 Jun 2022 13:59 IST

కేంద్రంపై విరుచుకుపడ్డ కేజ్రీవాల్‌

దిల్లీ: దిల్లీ ఆరోగ్య శాఖ మంత్రి సత్యేందర్ జైన్‌ అరెస్టు.. భాజపా, ఆమ్‌ ఆద్మీ పార్టీ(ఆప్‌) మధ్య మాటల యుద్ధానికి దారితీస్తోంది. ఈ క్రమంలో గురువారం నిర్వహించిన మీడియా సమావేశంలో దిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ కేంద్రంపై విరుచుకుపడ్డారు. ఇప్పుడు ఉపముఖ్యమంత్రి మనీశ్‌ సిసోడియాను ఇరికిస్తున్నారని, త్వరలో ఆయన్ను కూడా అరెస్టు చేయనున్నారని ఆరోపించారు. జైన్ అరెస్టుకు కొన్ని నెలల ముందు ముఖ్యమంత్రి ఇటువంటి వ్యాఖ్యలు చేశారు.

‘మనీశ్‌ సిసోడియాను త్వరలో అరెస్టు చేయబోతున్నారని విశ్వసనీయ వర్గాల ద్వారా తెలిసింది. ఆయనపై తప్పుడు కేసులు పెట్టమని కేంద్రం అన్ని దర్యాప్తు సంస్థలను ఆదేశించింది. మా అందరిపై ఒకేసారి రైడ్ చేయించండి. అరెస్టు చేసి, దర్యాప్తు జరపండి. ఆ తర్వాత మేం మళ్లీ మా పనిలోకి వెళ్లిపోవచ్చు. ఎందుకంటే మాకు రాజకీయాలు అర్థం కావు. మేం కేవలం పనిచేయాలనుకుంటున్నాం. విద్యారంగంలో మనీశ్‌ సిసోడియా చేస్తోన్న కృషి కారణంగా లబ్ధి పొందిన 18 లక్షల మంది చిన్నారులను ఓ ప్రశ్న అడగాలనుకుంటున్నాను. ఆయన అవినీతి పరుడా..? ఆయన భారత ఖ్యాతిని పెంచారు. అటువంటి వ్యక్తిని అరెస్టు చేయాలా..? రివార్డు ఇవ్వాలా..? సత్యేందర్‌ జైన్ మొహల్లా క్లినిక్‌ల ఏర్పాటులో, అందరికీ టీకాలు అందడంలో సహకరించారు. కానీ, ఇప్పుడు వారిని అవినీతిపరులు అంటున్నారు. మరి వారిద్దరు అవినీతిపరులు అయితే నిజాయతీపరులు ఎవరో చెప్పాలి..?’ అంటూ విద్యార్థులు, వారి తల్లిదండ్రులను ప్రశ్నించారు. ఎప్పుడూ ఇలాంటి దర్యాప్తులు ఎదుర్కొంటుంటే.. ఇంక మేం ఎప్పుడు పనిచేయాలని అడిగారు. ఏది ఏమైనప్పటికీ ప్రజలు మా వెంటే ఉంటారని ధీమా వ్యక్తం చేశారు. ఇదిలా ఉంటే, ప్రస్తుతం జైన్ మనీలాండరింగ్ కేసులో ఈడీ కస్టడీలో ఉన్నారు.   

Read latest India News and Telugu News

Follow us on Facebook, Twitter, Instagram & Google News.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

ap-districts
ts-districts

ఎక్కువ మంది చదివినవి (Most Read)

మరిన్ని