Aryan Khan: ఆర్యన్ వద్ద డ్రగ్స్ లేవు.. డ్రగ్స్ తీసుకున్నట్టూ తేలలేదు..!
క్రూయిజ్ నౌకలో డ్రగ్స్ కేసు వ్యవహారంలో బాలీవుడ్ స్టార్ షారుక్ ఖాన్ తనయుడు ఆర్యన్ ఖాన్‌ను అక్రమంగా అరెస్టు చేశారని అతడి తరఫున వాదిస్తున్న సీనియర్ న్యాయవాది
ఆర్యన్ బెయిల్‌పై బాంబే హైకోర్టులో కొనసాగుతున్న వాదనలు
ముంబయి: క్రూజ్ నౌకలో డ్రగ్స్ కేసు వ్యవహారంలో బాలీవుడ్ స్టార్ షారుక్ ఖాన్ తనయుడు ఆర్యన్ ఖాన్‌ను అక్రమంగా అరెస్టు చేశారని అతడి తరఫున వాదిస్తున్న సీనియర్ న్యాయవాది ముకుల్ రోహత్గీ బాంబే హైకోర్టుకు తెలిపారు. ఆర్యన్ బెయిల్ పిటిషన్‌పై ఉన్నత న్యాయస్థానం నేడు విచారణ చేపట్టింది. ఈ సందర్భంగా ముకుల్ రోహత్గీ కీలక విషయాలను కోర్టు దృష్టికి తీసుకొచ్చినట్లు తెలుస్తోంది.
‘‘క్రూజ్ నౌకలో పార్టీకి ఆర్యన్‌ను ప్రత్యేక అతిథిగా ఆహ్వానించారు. ప్రతీక్ గాబా అనే ఈవెంట్ ఆర్గనైజర్ పిలుపు మేరకు ఆర్యన్ అక్కడకు వెళ్లాడు. ఆర్యన్‌తో పాటు అర్బాజ్ మర్చెంట్‌ను కూడా ప్రతీక్ ఆహ్వానించాడు. నౌకపై వెళ్తుండగా వీరిద్దరినీ ఎన్‌సీబీ అధికారులు అదుపులోకి తీసుకున్నారు. అక్కడ డ్రగ్స్ దందా నడుస్తున్నట్లు వారికి ముందుగానే వారికి సమాచారం వచ్చినట్లుంది. అయితే ఆ తర్వాత వీరిని తనిఖీ చేయగా.. ఆర్యన్ వద్ద ఎలాంటి డ్రగ్స్ లభించలేదు. అర్బజ్ నుంచి కొంత మాదక ద్రవ్యాలు స్వాధీనం చేసుకున్నారు. అయితే అర్బజ్‌కు ఆర్యన్‌కు ఎలాంటి సంబంధం లేదు. అంతేగాక, ఆర్యన్ డ్రగ్స్ తీసుకున్నట్లు వైద్య పరీక్షల ఆధారాలేవీ లేవు. కానీ ఆ మరుసటి రోజు ఆర్యన్‌ను అరెస్టు చేశారు. తనతో పాటు కలిసి వచ్చిన ఓ వ్యక్తి దగ్గర మాదక ద్రవ్యాలు లభిస్తే ఆర్యన్‌ను ఎలా అరెస్టు చేస్తారు?’’ అంటూ రోహత్గీ తన వాదనలు వినిపించారు.
ఈ అరెస్టు పూర్తిగా అక్రమమే అని ఆయన వాదించారు. కుట్ర పూరితంగానే ఆర్యన్‌ను ఈ కేసులో ఇరికించారన్నారు. ఎన్‌సీబీ ఆరోపిస్తున్న 2018, 2019,2020 వాట్సాప్ చాట్‌లు క్రూజ్ పార్టీ కేసుకు సంబంధించినవి కాదని అన్నారు. ప్రస్తుతం దీనిపై వాదనలు కొనసాగుతున్నాయి.
ఇవీ చదవండి
గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని


తాజా వార్తలు (Latest News)
-
World News
మధుమేహ మాత్రతో లాంగ్ కొవిడ్‌కు కళ్లెం
-
Ts-top-news News
11 నెలలుగా...జీవచ్ఛవంలా..!.. ఆకతాయిల దాడే కారణం
-
Ap-top-news News
కుప్పంలో చంద్రబాబు ఇంటికి అడ్డంకులు
-
Sports News
రహానె స్కాన్ వద్దన్నాడు
-
Politics News
ఏపీ నేతలకు మాటలెక్కువ.. పని తక్కువ
-
Crime News
అసహజ శృంగారానికి బలవంతం చేస్తున్నారు.. తెలంగాణ ఐఏఎస్‌పై భార్య ఫిర్యాదు