Updated : 29/10/2021 18:29 IST

Aryan Khan: ఆర్యన్‌ బెయిల్‌కి 14 షరతులు ఇవే..

ముంబయి: దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించిన ముంబయి క్రూజ్‌ నౌక డ్రగ్స్‌ కేసులో బాలీవుడ్‌ స్టార్‌ షారుక్‌ ఖాన్‌ తనయుడు ఆర్యన్‌కు నిన్న బెయిల్‌ మంజూరైన విషయం తెలిసిందే. అయితే, ఈ బెయిల్‌ మంజూరుకు సంబంధించిన పూర్తిస్థాయి ఉత్తర్వులు విడుదలయ్యాయి. ఆర్యన్‌ఖాన్‌కు బాంబే హైకోర్టు 14 షరతులు విధించింది. కోర్టు ఆదేశాల మేరకు లాంఛనాలన్నీ పూర్తి చేసిన అనంతరం ఆర్యన్‌ను జైలు అధికారులు విడుదల చేయనున్నారు. మరోవైపు, ఆర్యన్‌ను సాధ్యమైనంత త్వరగా బయటకు తీసుకొచ్చే ప్రక్రియకు సంబంధించిన వ్యవహారాల్లో షారుక్‌ లీగల్‌ బృందం నిమగ్నమైంది. అక్టోబర్‌ 3న డ్రగ్స్‌ కేసులో అరెస్టయిన ఆర్యన్‌ ఖాన్‌.. 24 రోజుల పాటు జైలులో ఉన్న విషయం తెలిసిందే.

ఆర్యన్‌కు షరతులివే..

* రూ.లక్ష వ్యక్తిగత బాండ్‌ చెల్లించాలి. ఎన్‌డీపీఎస్‌ కోర్టు వద్ద పాస్‌పోర్టును సరెండర్‌ చేయాలి.

* ఒకరు లేదా ఇద్దరు వ్యక్తులు పూచీకత్తు సమర్పించాలి. 

*  ముంబయిలోని ఎన్‌డీపీఎస్‌ ప్రత్యేక కోర్టు అనుమతి లేకుండా దేశం విడిచి వెళ్లరాదు.

* గ్రేటర్‌ ముంబయి దాటి వెళ్లాలంటే దర్యాప్తు అధికారికి సమాచారం ఇవ్వాలి. ఎక్కడికి వెళ్తున్నారో ఆ వివరాలను సమర్పించాలి.

* డ్రగ్స్‌ కార్యకలాపాల్లో పాల్గొనరాదు. 

* ఈ కేసులో నిందితుడిగా ఉన్న తన స్నేహితుడు అర్బాజ్‌ మెర్చంట్‌తో పాటు ఈ కేసులో ఇతర నిందితులతోనూ మాట్లాడేందుకు ప్రయత్నించకూడదు.

* ఈ కేసు విచారణకు భంగంకలిగేలా వ్యవహరించరాదు.

* ఈ కేసులో సాక్షులను, ఆధారాలను ప్రభావితం చేసేందుకు ప్రయత్నించకూడదు.

* ఈ కేసుకు సంబంధించిన అంశాలపై మీడియా వద్ద మాట్లాడొద్దు.

* ప్రతి శుక్రవారం ఎన్‌సీబీ కార్యాలయంలో ఉదయం 11గంటలు - మధ్యాహ్నం 2గంటల మధ్య హాజరు కావాలి.

* ఎన్‌సీబీ అధికారులు విచారణకు ఎప్పుడు పిలిచినా వెళ్లాలి.

* కోర్టు విచారణకు అన్ని తేదీల్లోనూ హాజరుకావాలి.

* కేసు విచారణను ఆలస్యం చేసేలా ప్రవర్తించకూడదు.

* ఈ షరతులను ఆర్యన్‌ఖాన్‌ ఉల్లంఘిస్తే బెయిల్‌ రద్దు చేయాలంటూ ఎన్‌సీబీ అధికారులు కోర్టును కోరవచ్చు.


 

Read latest India News and Telugu News

 Follow us on Facebook, Twitter, Instagram, Koo, ShareChat and Google News. Subscribe our Telegram Channel.

Tags :

మరిన్ని

జిల్లా వార్తలు

సినిమా

మరిన్ని

బిజినెస్

మరిన్ని

క్రీడలు

మరిన్ని

పాలిటిక్స్

మరిన్ని

వెబ్ ప్రత్యేకం

మరిన్ని

జనరల్

మరిన్ని