
Aryan Khan: పుట్టినరోజున ఎన్సీబీ విచారణకు ఆర్యన్ ఖాన్.. జూహీ స్పెషల్ గిఫ్ట్
ముంబయి: బాలీవుడ్ స్టార్ షారుక్ ఖాన్ తనయుడు ఆర్యన్ ఖాన్ మరోసారి నార్కోటిక్స్ కంట్రోల్ బ్యూరో(ఎన్సీబీ) విచారణకు హాజరయ్యాడు. క్రూజ్ నౌక డ్రగ్స్ కేసులో ఆర్యన్ ఇటీవల బెయిల్‌పై విడుదలైన విషయం తెలిసిందే. కోర్టు ఆదేశాల మేరకు శుక్రవారం అతడు ఎన్సీబీ కార్యాలయానికి వచ్చాడు. అయితే.. ఆర్యన్ నేడు తన 24వ పుట్టినరోజు జరుపుకొంటున్నాడు. బర్త్‌డే రోజున కూడా ఎన్సీబీ ఆఫీసుకు రావాల్సి రావడంతో అతడి అభిమానులు విచారం వ్యక్తం చేస్తున్నారు.
క్రూజ్ నౌక డ్రగ్స్ కేసు వ్యవహారంలో అరెస్టయిన ఆర్యన్ ఖాన్‌కు బాంబే హైకోర్టు బెయిల్ మంజూరు చేసిన సంగతి తెలిసిందే. అయితే ఆ సమయంలో ఆర్యన్‌కు న్యాయస్థానం 14 షరతులు విధించింది. ప్రతి శుక్రవారం ఉదయం 11 గంటలు - మధ్యాహ్నం 2 గంటల మధ్య ఎన్సీబీ కార్యాలయంలో విచారణకు హాజరుకావాలని ఆదేశించింది. కోర్టు ఆదేశాల మేరకు గత వారం విచారణకు హాజరైన ఆర్యన్.. నేడు కూడా కార్యాలయానికి వచ్చాడు.
ఆర్యన్ పేరుపై 500 మొక్కలు..
ఇదిలా ఉండగా.. ఆర్యన్ పుట్టినరోజును పురస్కరించుకుని ప్రముఖ నటి జూహీ చావ్లా అతడికి ప్రత్యేక గిఫ్ట్ ఇచ్చారు. అతడి పేరుపై 500 మొక్కలు నాటుతానని ప్రమాణం చేశారు. ఈ మేరకు తన పిల్లలతో ఆర్యన్ చిన్ననాటి ఫొటోను ట్విటర్ వేదికగా పంచుకున్నారు. ఆర్యన్‌కు బెయిల్ ఇచ్చేందుకు రూ.లక్ష పూచీకత్తు సమర్పించాలని కోర్టు ఆదేశించగా.. జూహ్లీ చావ్లానే షూరిటీగా సంతకం చేశారు.
ఇవీ చదవండి
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సు సాంకేతికతతో పంపబడతాయి. ఏ ప్రకటనని అయినా పాఠకులు తగినంత జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.