FIFA 2022: ఫిఫా ఫైనల్‌కు అర్జెంటీనా.. ట్రెండింగ్‌లో SBI పాస్‌బుక్!

ఫిఫా ప్రపంచకప్‌ సందడి జోరుగా సాగుతోంది. ఇటీవల క్రొయేషియాను ఓడించిన అర్జెంటీనా.. ఫైనల్‌ బెర్తును ఖరారు చేసుకుంది. ఈ క్రమంలో సామాజిక మాధ్యమాల్లో ‘ఎస్బీఐ’ పాస్‌బుక్‌ వైరల్‌ అవుతోంది. కారణం.. అర్జెంటీనా జాతీయ జెండా, ఎస్బీఐ పాస్‌బుక్‌ రంగులు ఒకటే కావడం!

Published : 16 Dec 2022 16:40 IST

ఇంటర్నెట్‌ డెస్క్‌: ప్రపంచవ్యాప్తంగా ప్రస్తుతం ‘ఫుట్‌బాల్(Football)‌’ మేనియా సాగుతోంది. ఖతార్‌ వేదికగా ఫిఫా ప్రపంచ కప్‌(FIFA World Cup 2022) పోటీలు జరుగుతోన్న నేపథ్యంలో.. సాకర్‌ అభిమానుల హడావుడి అంతా ఇంతా కాదు. భారత్‌లోనూ ఈ జోష్‌ కనిపిస్తోంది. ఇటీవల సెమీ ఫైనల్‌ మ్యాచ్‌లో క్రొయేషియాపై అర్జెంటీనా(Argentina) విజయం సాధించి.. ఫైనల్‌కు దూసుకెళ్లిన విషయం తెలిసిందే. దీంతో.. సామాజిక మాధ్యమాల వేదికగా అర్జెంటీనా ఫ్యాన్స్‌ తమ ఆనందాన్ని వ్యక్తం చేస్తున్నారు. ఈ క్రమంలోనే రకరకాల మీమ్స్‌(Memes) వైరల్‌ అవుతున్నాయి.

ఇందులో ఎస్బీఐ పాస్‌బుక్‌(SBI Passbook) కవర్‌ ఫొటో కూడా ఉండటం గమనార్హం. కారణం.. అర్జెంటీనా జాతీయ జెండా రంగు, ఈ పాస్‌బుక్‌ కవర్‌ రంగు దాదాపు ఒకే కావడం! ఎస్బీఐ కూడా అర్జెంటీనాను సపోర్ట్‌ చేస్తోందని ఓ నెటిజన్‌ ట్విటర్‌లో ఓ పోస్ట్‌ చేశారు. భారతీయులూ అర్జెంటీనాకు మద్దతు పలకడం వెనుక అసలైన కారణం ఇదేనంటూ మరికొందరు పేర్కొంటున్నారు. మ్యాచ్‌ సందర్భంగా మీకు అర్జెంటీనా జెండా అందుబాటులో లేకపోతే ఈ పాస్‌బుక్‌ను వినియోగించండని ఒకరు సరదా సలహా ఇచ్చారు. అఫీషియల్‌ పార్ట్‌నర్‌ ఎస్బీఐ అని ఒకరు పోస్ట్‌ పెట్టారు. దీనికి సంబంధించిన కొన్ని మీమ్స్‌ చూసేయండి..

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని