Asaram Bapu: మరో అత్యాచారం కేసులో దోషిగా ఆశారాం బాపూ
వివాదాస్పద ఆధ్యాత్మిక వేత్త ఆశారాం బాపూ మరో రేప్ కేసులో దోషిగా తేలారు. ఆయనకు గాంధీనగర్ కోర్టు మంగళవారం శిక్షలు ఖరారు చేయనుంది.
అహ్మదాబాద్: 16 ఏళ్ల బాలికపై అత్యాచారం కేసులో అరెస్టయి ఇప్పటికే జైలు శిక్ష అనుభవిస్తోన్న ఆధ్యాత్మికవేత్త ఆశారాం బాపూ(Asaram Bapu) మరో రేప్ కేసులో దోషిగా తేలారు. దాదాపు దశాబ్ద కాలం క్రితం నాటి అత్యాచారం కేసులో గుజరాత్ కోర్టు ఆయన్ను దోషిగా నిర్ధారించింది. 2013లో గుజరాత్ మోతేరాలోని ఆశారాం బాపూ ఆశ్రమంలో పనిచేస్తున్న సమయంలో తనపై ఆయన పలుమార్లు అఘాయిత్యానికి పాల్పడినట్టు ఓ మహిళ పోలీసులకు ఫిర్యాదు చేశారు. దీంతో ఆయనపై పలు సెక్షన్ల కింద కేసులు నమోదు కాగా.. దీనిపై విచారణ జరిపిన గాంధీనగర్‌లోని సెషన్స్ కోర్టు ఈ కేసులో ఆశారాంను దోషిగా తేల్చింది. సూరత్‌కు చెందిన ఒక మహిళ ఆశారాం బాపూతో పాటు మరో ఏడుగురిపై అత్యాచారం, అక్రమ నిర్బంధం కేసు పెట్టారు. వీరిలో ఒకరు విచారణ పెండింగ్‌లో ఉండగానే 2013 అక్టోబర్‌లో మృతిచెందగా.. 2014 జులైలో పోలీసులు ఛార్జిషీట్ దాఖలు చేశారు. ఈ కేసులో సరైన ఆధారాలు చూపనందున ఆశారాం భార్యతో పాటు మరో ఆరుగురిని గాంధీనగర్‌లోని న్యాయస్థానం దోషులుగా పేర్కొంది. ఈ కేసులో తీర్పును రిజర్వు చేసిన న్యాయమూర్తి.. దోషులకు శిక్షలను మంగళవారం (జనవరి 31)న ఖరారు చేయనున్నారు.
2018లో జోధ్‌పూర్ ట్రయల్ కోర్టు ఆశారాం బాపూను అత్యాచారం కేసులో దోషిగా తేల్చడంతో ప్రస్తుతం ఆయన జోధ్‌పూర్ జైలులో శిక్ష అనుభవిస్తున్నారు. గతంలో జోధ్‌పూర్‌లోని ఆశ్రమంలో 16 ఏళ్ల బాలికపై అత్యాచారం చేశారన్న ఆరోపణలపై నమోదైన కేసులో దోషిగా తేలడంతో అతడిని ఇండోర్‌లో అరెస్టు చేసిన పోలీసులు అనంతరం జోధ్‌పూర్‌కు తరలించారు.
ఇవీ చదవండి
గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని


తాజా వార్తలు (Latest News)
-
India News
Rahul Gandhi: ‘అప్పీల్ చేసుకునే స్థితిలోనే..’: రాహుల్ అనర్హతపై జర్మనీ స్పందన
-
Temples News
తండ్రి కోసం భీషణ ప్రతిజ్ఞ చేసి.. భీష్ముడిగా నిలిచి..
-
General News
Top Ten News @ 9 AM: ఈనాడు.నెట్‌లో టాప్ 10 వార్తలు
-
Crime News
Crime News: మద్యం మత్తులో భార్య, కుమార్తె హత్య
-
Ap-top-news News
AP Govt: మార్చి నెల జీతాలు ఎప్పుడొస్తాయో?
-
Crime News
Duranto Express: బొలెరో వాహనాన్ని ఢీకొట్టిన దురంతో ఎక్స్‌ప్రెస్..