Jobs: లక్ష ఉద్యోగాలు భర్తీ చేస్తాం: సీఎం గహ్లోత్‌ ప్రకటన

రాష్ట్రంలో ఖాళీగా ఉన్న ఉద్యోగాల్లో లక్ష పోస్టుల(One lakh jobs) వచ్చే ఆర్థిక సంవత్సరంలో భర్తీ చేయనున్నట్టు రాజస్థాన్‌(Rajasthan) సీఎం అశోక్‌ గహ్లోత్‌ (Ashok gehlot) ప్రకటించారు.

Published : 16 Feb 2023 22:10 IST

జైపూర్‌: రాజస్థాన్‌(Rajasthan) ముఖ్యమంత్రి అశోక్‌ గహ్లోత్‌(Ashok gehlot) అసెంబ్లీలో కీలక ప్రకటన చేశారు. వచ్చే ఆర్థిక సంవత్సరంలో రాష్ట్రంలో లక్ష ఉద్యోగాలను భర్తీ చేయనున్నట్టు వెల్లడించారు. రాష్ట్ర బడ్జెట్‌పై చర్చకు సమాధానంగా అసెంబ్లీలో మాట్లాడిన ఆయన.. తమ ప్రభుత్వం ప్రవేశపెట్టిన బడ్జెట్‌ అద్భుతంగా ఉందన్నారు. ‘‘ఫిబ్రవరి 10న బడ్జెట్‌ను సమర్పిస్తున్న సమయంలో ప్రస్తుతం నియామక ప్రక్రియలో ఉన్న ఉద్యోగాలతో పాటు వచ్చే ఏడాది అదనంగా మరికొన్ని ఉద్యోగాలను భర్తీ చేస్తామని చెప్పాను. ఈ నేపథ్యంలో వచ్చే ఏడాది లక్ష ఉద్యోగాలను భర్తీ చేస్తాం’’ అని సీఎం ప్రకటించారు. మరోవైపు, రాజస్థాన్‌ అసెంబ్లీకి ఈ ఏడాది చివర్లో ఎన్నికలు జరగనున్నాయి. వచ్చే ఏడాది జనవరి 14తో అసెంబ్లీ గడువు ముగియనుండటంతో ఈ ఏడాది డిసెంబర్‌ నాటికి ఎన్నికలు జరిగే అవకాశం ఉన్న విషయం తెలిసిందే.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని