UGC-NET: సారూ.. పరీక్షలెప్పుడు నిర్వహిస్తారు?

అధ్యాపకుల అర్హత కోసం జాతీయ స్థాయిలో నిర్వహించే నేషనల్‌ ఎలిజిబిటీ టెస్ట్‌(నెట్‌)పై సందిగ్ధత కొనసాగుతూనే ఉంది. ఈ పరీక్షను నేషనల్‌ టెస్టింగ్‌ ఏజెన్సీ(ఎన్‌టీఏ) ఏటా రెండు సార్లు నిర్వహిస్తుంటుంది. డిసెంబర్‌ 2020లో జరగాల్సిన నెట్‌ పరీక్ష కరోనా కారణంగా ఇప్పటికి నాలుగుసార్లు వాయిదా

Published : 22 Oct 2021 22:55 IST

ఇంటర్నెట్‌ డెస్క్‌: అధ్యాపకుల అర్హత కోసం జాతీయ స్థాయిలో నిర్వహించే నేషనల్‌ ఎలిజిబిలిటీ టెస్ట్‌(నెట్‌)పై సందిగ్ధత కొనసాగుతూనే ఉంది. ఈ పరీక్షను నేషనల్‌ టెస్టింగ్‌ ఏజెన్సీ(ఎన్‌టీఏ) ఏటా రెండు సార్లు నిర్వహిస్తుంటుంది. గతేడాది జరగాల్సిన నెట్‌-డిసెంబర్‌ 2020 పరీక్ష కరోనా కారణంగా ఇప్పటికి నాలుగుసార్లు వాయిదా పడింది. ఈ ఏడాది జూన్‌లో నిర్వహించాల్సిన నెట్‌-జూన్‌ 2021 పరీక్షను కూడా నెట్‌-డిసెంబర్‌ 2020లో కలిపేశారు. రెండు పరీక్షలను కలిపి ఒక్కసారే నిర్వహించాలని ఎన్‌టీఏ నిర్ణయించింది. ఈ క్రమంలో అక్టోబర్‌ 17-25 మధ్య నెట్‌ పరీక్షలు నిర్వహిస్తామని ప్రకటించిన ఎన్‌టీఏ.. మరోసారి పరీక్షలను వాయిదా వేసింది. మళ్లీ ఎప్పుడు నిర్వహిస్తామనేది ఇంకా ప్రకటించలేదు.

గత 10 నెలలుగా నెట్‌ పరీక్షను నిర్వహించకుండా వాయిదా వేయడం పట్ల అభ్యర్థులంతా ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. తొందరగా పరీక్షల షెడ్యూల్‌ను విడుదల చేయాలని సోషల్‌మీడియా వేదికగా ఎన్‌టీఏ సంస్థను, కేంద్ర విద్యాశాఖ మంత్రిని డిమాండ్‌ చేస్తున్నారు. ఒకవేళ అకస్మాత్తుగా పరీక్షలు నిర్వహిస్తే అభ్యర్థులు తీవ్ర ఒత్తిడికి గురయ్యే అవకాశముందని, పరీక్ష తేదీలను కనీసం 25-30 రోజుల ముందు ప్రకటించాలని కోరుతున్నారు. ఈ మేరకు ఎన్‌టీఏ, యూజీసీ, కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్‌ ట్విటర్‌ ఖాతాలను ట్యాగ్‌ చేస్తూ ట్వీట్లు చేస్తున్నారు. ఈ క్రమంలో ట్విటర్‌లో #ReleaseNetExamDate హ్యాష్‌ట్యాగ్‌ ట్రెండ్‌ అవుతోంది.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని