Boundary dispute: అస్సాం, మేఘాలయ శాంతి మంత్రం.. 50 ఏళ్ల సరిహద్దు వివాదానికి తెర!

తమ రాష్ట్రాల మధ్య 50 ఏళ్లుగా కొనసాగుతున్న సరిహద్దు వివాదాన్ని పరిష్కరించుకునేందుకు అస్సాం ముఖ్యమంత్రి హిమంత బిస్వా శర్మ, మేఘాలయ సీఎం కాన్రాడ్ సంగ్మా......

Published : 29 Mar 2022 20:13 IST

అమిత్‌షా ఆధ్వర్యంలో ఇరు రాష్ట్రాల సంతకాలు

దిల్లీ: తమ రాష్ట్రాల మధ్య 50 ఏళ్లుగా కొనసాగుతున్న సరిహద్దు వివాదాన్ని పరిష్కరించుకునేందుకు అస్సాం ముఖ్యమంత్రి హిమంత బిస్వా శర్మ, మేఘాలయ సీఎం కాన్రాడ్ సంగ్మా మంగళవారం ఓ ఒప్పందంపై సంతకాలు చేశారు. తమ రాష్ట్రాల సరిహద్దులతో పాటు 12 ప్రాంతాల్లోని ఆరింటిలో సరిహద్దు వివాదాలను పరిష్కరించుకునేందుకు ముసాయిదా తీర్మానాన్ని రూపొందించాయి. కేంద్ర హోంమంత్రి అమిత్ షా ఆధ్వర్యంలో ఈ శాంతి ఒప్పందం జరిగింది. ఇరు రాష్ట్రాల ప్రధాన కార్యదర్శులు, హోం మంత్రిత్వ శాఖ ఇతర అధికారుల ఈ భేటీలో పాల్గొన్నారు. కేంద్ర హోంమంత్రి కార్యాలయంలో జరిగిన సమావేశంలో మేఘాలయ ప్రభుత్వం తరఫున మొత్తం 11 మంది, అస్సాంకు చెందిన తొమ్మిది మంది ప్రతినిధులు హాజరయ్యారు.

కాగా ఈ ఒప్పందంపై అమిత్‌ షా హర్షం వ్యక్తం చేశారు. ఐదు దశాబ్దాలుగా కొనసాగుతున్న వివాదానికి ముగింపు పలికే ఒప్పందంపై సంతకం చేయడం ఈశాన్య రాష్ట్రాలకు చారిత్రక రోజు అని ఆయన పేర్కొన్నారు. కేంద్రంలో మోదీ ప్రభుత్వం అధికారం చేపట్టినప్పటి నుంచి పలు ఈశాన్య రాష్ట్రాల సరిహద్దు వివాదాలను పరిష్కరించామన్నారు. దీంతోపాటు ఆయా రాష్ట్రాల అభివృద్ధికి విశేష కృషి చేసినట్లు తెలిపారు.

అస్సాం, మేఘాలయ రాష్ట్రాలు 885 కిలోమీటర్ల పొడవైన సరిహద్దును పంచుకుంటున్నాయి. అస్సాం పునర్వ్యవస్థీకరణ చట్టం 1971 ప్రకారం, అస్సాం నుంచి మేఘాలయను వేరు చేశారు. కాగా ఈ చట్టాన్ని మేఘాలయ సవాలు చేసింది. దీంతో ఈ వ్యవహారం వివాదాలకు దారితీసింది.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని