Maradona: బూట్లు, లైటర్లు, ఐపాడ్లు.. మారడోనా వస్తువులు స్వాధీనం

సాకర్‌ మాంత్రికుడు డీగో మారడోనా వినియోగించిన పలు ఖరీదైన వస్తువులను అస్సాం పోలీసులు స్వాధీనం చేసుకొన్నారు.

Published : 13 Dec 2021 01:10 IST

ఇంటర్నెట్‌డెస్క్‌: సాకర్‌ మాంత్రికుడు డీగో మారడోనా వినియోగించిన పలు ఖరీదైన వస్తువులను అస్సాం పోలీసులు స్వాధీనం చేసుకొన్నారు. నిన్న చేతి గడియారాన్ని స్వాధీనం చేసుకొన్న అధికారులు మరిన్ని వస్తువులు ఉన్నట్లు గుర్తించారు. దుబాయ్‌ అధికారుల సమాచారంతో నిన్న వాజిద్‌ హుస్సేన్‌ను అరెస్టు చేశారు. అతని అల్లుడి ఇంట్లో మరికొన్ని వస్తువులు స్వాధీనం చేసుకొన్నారు. రికవరీ చేసిన వాటిల్లో రెండు ఐపాడ్స్‌, రెండు స్క్వాష్‌ రాకెట్లు, ఆరు లైటర్లు, రెండు జతల బూట్లు, ఒక జాకెట్‌, ఒక టీషర్ట్‌, ఒక క్యాప్‌, ఒక బొమ్మ ఉన్నాయి. ఈ విషయాన్ని శివసాగర్‌ జిల్లా ఎస్‌పీ రాకేష్‌ రౌషన్‌ తెలిపారు.

ఆయన మాట్లాడుతూ 11వ తేదీన హుస్సేన్‌ను అరెస్టు చేసి వాచీని స్వాధీనం చేసుకొన్నట్లు ఎస్పీ చెప్పారు. మారడోనాకు దుబాయ్‌లో ఉన్న ఇంట్లో హుస్సేన్‌ పనిచేస్తున్నాడని వెల్లడించారు. హుస్సేన్‌ ఆచుకీ గుర్తించిన దుబయ్‌ పోలీసులు కొన్ని రోజుల క్రితం భారత్‌లోని దర్యాప్తు సంస్థలను అప్రమత్తం చేశారు. దీంతో శివసాగర్‌ పోలీసులు నిందితుడిని అరెస్టు చేశారు. ఒక వేళ దుబాయ్‌ పోలీసులు నిందితుడిని అప్పగించమని కోరితే.. పంపించాల్సి ఉంటుందని.. లేకపోతే భారత్‌లో చట్టపరమైన చర్యలు తీసుకొంటామని ఎస్పీ పేర్కొన్నారు. గతేడాది మారడోనా మరణించాక దుబాయ్‌లోనే ఆయన వస్తువులను భద్రపర్చారు. 

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు