Assam: లక్ష కేసుల్ని ఉపసంహరించుకుంటాం.. సీఎం హిమంత ప్రకటన

స్వాతంత్ర్య దినోత్సవ వేడుకల సందర్భంగా అస్సాం సీఎం హిమంత బిశ్వశర్మ కీలక ప్రకటన చేశారు. రాష్ట్రంలో పెండింగ్‌లో......

Published : 16 Aug 2022 01:52 IST

గువాహటి: స్వాతంత్ర్య దినోత్సవ వేడుకల సందర్భంగా అస్సాం సీఎం హిమంత బిశ్వశర్మ కీలక ప్రకటన చేశారు. రాష్ట్రంలో పెండింగ్‌లో ఉన్న చిన్న చిన్న కేసుల్ని తమ ప్రభుత్వం ఉపసంహరించుకోనున్నట్టు ప్రకటించారు. కింది కోర్టుల్లో ఒత్తిడిని తగ్గించేందుకు వీలుగా సోషల్‌ మీడియా పోస్టులు, తదితర మైనర్‌ కేసుల్ని వెనక్కి తీసుకోవాలని నిర్ణయించినట్టు తెలిపారు. అలాగే, విద్య, ఆరోగ్యం, వ్యవసాయం, ఇతర రంగాలను బలోపేతానికి పలు చర్యలు ప్రకటించారు. 76వ స్వాతంత్ర దినోత్సవం సందర్భంగా గువాహటిలో జాతీయ జెండాను ఎగురవేసిన అనంతరం ఆయన ప్రసంగించారు. రాష్ట్రంలో కిందిస్థాయి కోర్టుల్లో దాదాపు 4లక్షలకు పైగా కేసులు పెండింగ్‌లో ఉన్నాయన్నారు. అయితే, ఆగస్టు 14 అర్ధరాత్రి వరకు నమోదైన లక్ష మైనర్‌ కేసుల్ని ఉపసంహరించుకోవాలని తమ ప్రభుత్వం నిర్ణయించిందని సీఎం వెల్లడించారు. ఈ నిర్ణయంతో అత్యాచారం, హత్య వంటి క్రూరమైన నేరాలపై దృష్టిసారించేందుకు న్యాయవ్యవస్థకు వీలు ఏర్పడుతుందన్నారు. న్యాయవాదులు అందుబాటులో లేక ఎవరైనా అమాయకులు జైళ్లలో మగ్గుతుంటే అలాంటి వాళ్లను తక్షణమే విడుదల చేస్తామని చెప్పారు.

అస్సాంలో ఉన్నత పాఠశాలల్లో మౌలికవసతులు, 15వేల కొత్త అంగన్వాడీ సెంటర్ల ప్రారంభం కోసం రూ.10వేల కోట్లు కేటాయించనున్నట్టు సీఎం ప్రకటించారు. ఈ ఏడాది వరదలకు నష్టపోయిన వారికి ఆగస్టు 20లోపు నష్టపరిహారం అందజేయనున్నట్టు తెలిపారు. కులవ్యవస్థ మన సమాజాన్ని వెనక్కి నెడుతోందని.. అలాంటి వ్యవస్థను నిర్మూలించడంలో అస్సాం ముందుంటుందన్నారు. వచ్చే 25ఏళ్లలో అస్సాం కొత్త శిఖరాలకు చేరుతుందని ఆశిస్తున్నట్టు తెలిపారు.

Read latest India News and Telugu News

Follow us on Facebook, Twitter, Instagram & Google News.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

ap-districts
ts-districts

ఎక్కువ మంది చదివినవి (Most Read)

మరిన్ని