Published : 24 Jun 2022 19:14 IST

Maharashtra crisis: ఉద్ధవ్ ఠాక్రే.. మీరైనా అస్సాంకు రావొచ్చు: హిమంత బిశ్వ శర్మ

దిల్లీ: మహారాష్ట్ర(Maharashtra) ముఖ్యమంత్రి ఉద్ధవ్ ఠాక్రే(Uddhav Thackeray)పై తిరుగుబాటు చేయడానికి శివసేన( Shiv Sena) రెబల్‌ ఎమ్మెల్యేలకు సహకరించారని తనపై వస్తున్న ఆరోపణలను అస్సాం ముఖ్యమంత్రి హిమంత బిశ్వ శర్మ(Himanta Biswa Sarma) తోసిపుచ్చారు. ఈ మేరకు దిల్లీలో ఓ జాతీయ వార్త సంస్థతో ఆయన శుక్రవారం మాట్లాడారు. అస్సాం సందర్శనకు ఎవరైనా రావొచ్చని తెలిపారు. తమ రాష్ట్రానికి వచ్చే వారిని రాకుండా ఎలా ఆపగలనని ప్రశ్నించారు.

‘‘దేశం నలుమూలల నుంచి ఎమ్మెల్యేలు అస్సాంను సందర్శించాల్సిందిగా స్వయంగా నేనే ఆహ్వానిస్తుంటాను. అలా వచ్చే వారిని నేనెలా ఆపగలను? అస్సాంలోని హోటల్‌కు రావొద్దని నేనెలా చెప్పగలను?మా రాష్ట్రానికి ఎవరైనా వచ్చారంటే నేను చాలా సంతోషిస్తాను. వాళ్లు ఎన్ని రోజులు ఉండాలనుకుంటే అన్ని రోజులు ఇక్కడ ఉండొచ్చు’’ అని హిమంత అన్నారు. శివసేన రెబల్‌ ఎమ్మెల్యేల విషయంలో ఉద్ధవ్ ఠాక్రేకు ఏం చెప్పాలనుకుంటున్నారని విలేకరి అడిగిన ప్రశ్నకు హిమంత స్పందిస్తూ.. ‘‘ఉద్ధవ్ ఠాక్రే.. మీరు కూడా వేకేషన్‌ కోసం అస్సాం రావొచ్చు’’ అని జవాబిచ్చారు. 

ఇదిలా ఉండగా.. రెబల్‌ ఎమ్మెల్యే ఏక్‌నాథ్‌ శిందే వర్గంలో దాదాపు 40 మంది శివసేన ఎమ్మెల్యేలు.. ఇతర పార్టీ నేతలు(10) కూడా ఉన్నారని తెలుస్తోంది. దీంతో రెబల్‌ వర్గానికి మ్యాజిక్‌ ఫిగర్‌(37) లభించినట్లే కనిపిస్తోంది. మరోవైపు రెబల్‌ వర్గాన్ని వెనక్కి రప్పించేందుకు శివసేన ‘అనర్హత వేటు’ అస్త్రాన్ని ప్రయోగించే పనిలో పడింది. ఇప్పటికే 12 మంది ఎమ్మెల్యేలపై అనర్హత వేటు వేయాలని కోరుతూ డిప్యూటీ స్పీకర్‌కు లేఖ రాసిన విషయం తెలిసిందే.

Read latest India News and Telugu News

Follow us on Facebook, Twitter, Instagram, Koo, ShareChat, and Google News.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సు సాంకేతికతతో పంపబడతాయి. ఏ ప్రకటనని అయినా పాఠకులు తగినంత జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

మరిన్ని