Assam: బాలికల కోసం అస్సాం సర్కార్‌ కొత్త స్కీమ్‌.. ప్రతి నెలా రూ.1000

బాల్య వివాహాలను అరికట్టడమే లక్ష్యంగా అస్సాం ప్రభుత్వం ఓ పథకాన్ని ప్రవేశపెట్టనుంది.

Published : 12 Jun 2024 22:25 IST

గువహటి: బాల్య వివాహాలను, మాతా శిశు మరణాలను తగ్గించేందుకు అస్సాం (Assam) సర్కార్‌ తీవ్రంగా యత్నిస్తోంది. ఈ క్రమంలోనే బాలికల బంగారు భవిష్యత్తు కోసం కొత్త పథకాన్ని ప్రవేశపెట్టనుంది. దీనిద్వారా ప్రతి నెలా బాలికా విద్యార్థుల ఖాతాలోకి కొంత మొత్తాన్ని జమ చేయనున్నట్లు సంబంధిత అధికారులు వెల్లడించారు.

ముఖ్యమంత్రి నిజుత్‌ మొయినా (MMNM)కి రాష్ట్ర మంత్రివర్గం బుధవారం ఆమోదం తెలిపింది. ఈ పథకం ద్వారా పోస్టు గ్రాడ్యుయేషన్‌ పూర్తి అయ్యేంతవరకు బాలికలను ప్రభుత్వమే చదివించనుంది. పథకం కోసం ఏటా రూ.300 కోట్లు కేటాయించనుంది. ప్రభుత్వం ప్రతి నెలా బాలికా విద్యార్థునుల ఖాతాలో రూ.1000 జమ చేయనుంది. డిగ్రీలో చేరినవారికి రూ.1,250.. పోస్టు గ్రాడ్యుయేషన్‌ చేసే వారికి రూ.2,500 ఇవ్వనుంది. బాల్య వివాహాల నిర్మూలనే లక్ష్యంగా దీన్ని త్వరలో అమలుచేయనుంది.

టికెట్‌ లేని ప్రయాణికులతో వందే భారత్‌ రష్‌.. స్పందించిన రైల్వే శాఖ

‘‘బాల్య వివాహాల నుంచి ఆడబిడ్డలను రక్షించేందుకు.. బంగారు భవిష్యత్తును అందించే లక్ష్యంతో వారి బాధ్యతను రాష్ట్రప్రభుత్వం తీసుకొంది. ప్రతినెలా 11వ తేదీ నాటికి విద్యార్థుల ఖాతాలో డబ్బు జమ అవుతుంది’’ అని రాష్ట్ర సీఎం హిమంత బిశ్వశర్మ (Himanta Biswa Sarma) పేర్కొన్నారు. 

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు