Viral video: గాల్లో పిజ్జాని ఎలా తింటున్నారో చూశారా?

ఇందులో ఆరుగురు వ్యోమగాములు ‘‘ఫ్లోటింగ్‌ పిజ్జా పార్టీ’’ చేసుకున్నారు. నిమిషం నిడివి ఉన్న ఈ వీడియోలో గాల్లో  పిజ్జా తయారు చేసుకుంటూ కనిపించారు. ‘‘ ఈరోజు మాకు స్నేహితులతో పిజ్జా నైట్‌.. అంతరిక్షంలో ఉన్నా సరే.. భూమి మీద శనివారం వస్తే ఎలా ఉంటామో అలానే సందడి చేస్తున్నాం.

Updated : 30 Aug 2021 15:45 IST

ఇంటర్నెట్‌ డెస్క్‌: అంతరిక్షంలో ప్రయాణించేటప్పుడు ఉండే కిక్కే వేరంటారు వ్యోమగాములు. ఇక స్పేస్‌లో ఉండేటప్పుడు.. వారికి నచ్చే ఆహారానికి దూరంగా ఉండాల్సి వస్తుంది. కానీ ఈ వ్యోమగాములు అలా చేయలేదు. అంతర్జాతీయ అంతరిక్ష కేంద్రం(ఐఎస్‌ఎస్‌)లో గాల్లో పిజ్జా తింటూ.. ఆ క్షణాలను ఆస్వాదించారు. ఇందుకు సంబంధించిన వీడియోను ఆస్ట్రోనాట్‌ థామస్‌ ఇన్‌స్టాగ్రామ్‌లో షేర్‌ చేశారు. ఇందులో ఆరుగురు వ్యోమగాములు ‘‘ఫ్లోటింగ్‌ పిజ్జా పార్టీ’’ చేసుకున్నారు. నిమిషం నిడివి ఉన్న ఈ వీడియోలో గాల్లో  పిజ్జా తయారు చేసుకుంటూ కనిపించారు. ‘‘ ఈరోజు మాకు స్నేహితులతో పిజ్జా నైట్‌.. అంతరిక్షంలో ఉన్నా సరే.. భూమి మీద శనివారం వస్తే ఎలా ఉంటామో అలానే సందడి చేస్తున్నాం. మంచి చెఫ్‌ తన వంటల సీక్రెట్స్‌ గురించి చెప్పరంటారు. కానీ నేను అలా కాకుండా వీడియో తీసి మీతో పంచుకుంటున్నా. ఈ పిజ్జా తయారీ మొత్తంలో ఒక్క పైనాపిల్‌కు మాత్రం మినహాయింపు ఇవ్వండి. ఎందుకంటే ఇటలీలో పిజ్జా తయారీలో పైనాపిల్‌ నిషేధం’’ అంటూ రాసుకొచ్చారు.


Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు