Pakistan: కరాచీలో భారీ పేలుడు.. 12 మంది మృతి

పాకిస్థాన్‌లోని కరాచీలో శనివారం భారీ పేలుడు సంభవించింది. ఇక్కడి షేర్‌షా ప్రాంతంలోని ఓ బ్యాంకు భవనంలో ఈ ఘటన చోటుచేసుకోగా.. దాదాపు 12 మంది మృతి చెందారు. మరో 13 మంది గాయపడినట్లు స్థానిక పోలీసులు వెల్లడించారు. గ్యాస్‌ లీకేజీయే పేలుడుకు...

Published : 18 Dec 2021 19:25 IST

ఇస్లామాబాద్‌: పాకిస్థాన్‌లోని కరాచీలో శనివారం భారీ పేలుడు సంభవించింది. ఇక్కడి షేర్‌షా ప్రాంతంలోని ఓ బ్యాంకు భవనంలో ఈ ఘటన చోటుచేసుకోగా.. దాదాపు 12 మంది మృతి చెందారు. మరో 13 మంది గాయపడినట్లు స్థానిక పోలీసులు వెల్లడించారు. గ్యాస్‌ లీకేజీయే పేలుడుకు కారణమై ఉంటుందని ప్రాథమికంగా భావిస్తున్నట్లు చెప్పారు. బాధితుల్లో అత్యధికులు బ్యాంకు సిబ్బంది, వినియోగదారులేనని స్థానికంగా ఓ వార్తాసంస్థ వెల్లడించింది. పేలుడు ధాటికి రెండంతస్తుల భవనం ధ్వంసమైందని, సమీపంలో పార్క్ చేసిన కార్లు, ద్విచక్ర వాహనాలూ దెబ్బతిన్నాయని తెలిపింది.

శిథిలాల కింద పలువురి సమాధి?

బాంబు డిస్పోజల్ స్క్వాడ్ ఘటనా స్థలానికి చేరుకుందని, ఈ వ్యవహారంపై దర్యాప్తు చేస్తోందని పోలీసులు తెలిపారు. ఈ భవనాన్ని ఓ నాలాపై నిర్మించారని.. అయితే, గ్యాస్‌ పైప్‌లైన్‌ లీకేజీ కారణంగా ప్రమాదం జరిగిందా? లేదా నాలాలో మిథేన్‌ వాయువు పేరుకుపోయి పేలుడు సంభవించిందా? తేలాల్సి ఉందని ఓ సీనియర్‌ అధికారి తెలిపారు. మరోవైపు భవనం శిథిలాల కింద పలువురు సమాధి అయ్యారని ప్రత్యక్ష సాక్షులు తెలిపారు. అధికారులు హుటాహుటిన సహాయక చర్యలు ప్రారంభించారు. శిథిలాలను తొలగించే పనిలో పడ్డారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని