
Florida: కుప్పకూలిన భవనం.. 159 మంది గల్లంతు
ఫ్లోరిడా: అమెరికాలోని ఫ్లోరిడాలో ఘోర ప్రమాదం చోటు చేసుకుంది. ఉత్తర మియామీ సమీపంలోని 12 అంతస్తుల నివాస భవనం కూలిన ఘటనలో నలుగురు చనిపోగా, 159మంది ఆచూకీ లభ్యం కావటం లేదు. సమాచారం తెలుసుకున్న పోలీసులు, అగ్నిమాపక సిబ్బంది, విపత్తు నిర్వహణ సిబ్బంది హుటాహుటీన ఘటనా స్థలానికి చేరుకున్నారు. శిథిలాల కింద చిక్కుకుపోయిన వారిని బయటకు తీసుకొచ్చేందుకు సహాయక చర్యలు ప్రారంభించారు. ఛాంపియన్ టవర్స్ శిథిలాల కింద ఉన్న వారిని రక్షించేందుకు చర్యలు చేపట్టినట్లు మేయర్ చార్లెస్ బర్కెట్ తెలిపారు. గురువారం రాత్రి ఈ ఘటన జరిగింది. ఏళ్ల క్రితం నిర్మించిన భవనంలో కొన్ని రోజుల కిందట పగుళ్లు గుర్తించినట్లు స్థానిక ఇంజినీర్లు చెబుతున్నారు. వాటికి మరమ్మతులు చేయాల్సి ఉండగా, ఈలోగా ప్రమాదం జరిగింది.
ఇవీ చదవండి
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సు సాంకేతికతతో పంపబడతాయి. ఏ ప్రకటనని అయినా పాఠకులు తగినంత జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.