Odisha Train Tragedy: ఒడిశా రైలు దుర్ఘటన.. విద్యుత్ షాక్‌తోనే 40 మంది మృతి..!
Odisha Train Tragedy: ఒడిశా రైలు దుర్ఘటనలో కనీసం 40 మంది విద్యుత్ షాక్ వల్లే చనిపోయినట్లు తెలుస్తోంది. ప్రమాదంతో విద్యుత్ తీగలు తెగిపోయి బోగీలపై పడ్డాయి.
భువనేశ్వర్: ఒడిశాలో గతవారం మూడు రైళ్లు ఢీకొన్న ఘోర ప్రమాదం(Odisha Train Tragedy)లో మరిన్ని విషయాలు వెలుగులోకి వస్తున్నాయి. ఈ ఘటనలో ఇప్పటివరకు 278 మంది దుర్మరణం చెందిన విషయం తెలిసిందే. అయితే ఇందులో కనీసం 40 మంది విద్యుత్ షాక్ (electrocution) వల్లే ప్రాణాలు కోల్పోయినట్లు తెలుస్తోంది. ఈ మేరకు రెస్క్యూ ఆపరేషన్‌ను పర్యవేక్షించిన ఓ పోలీసు అధికారి వెల్లడించారు.
ప్రమాదం తర్వాత ఘటనాస్థలంలో సహాయక చర్యలు చేపట్టిన రెస్క్యూ సిబ్బంది.. పట్టాలు తప్పిన బోగీల నుంచి మృతదేహాలను బయటకు తీశారు. అయితే ఇందులో కనీసం 40 మృతదేహాలపై ఎలాంటి గాయాలైన ఆనవాళ్లు కన్పించలేదని సదరు పోలీసు అధికారి తెలిపారు. ఇదే విషయాన్ని ప్రభుత్వ రైల్వే పోలీసులు (జీఆర్పీ) కూడా తమ ఎఫ్‌ఐఆర్‌లో పేర్కొన్నారు. ప్రమాదం జరిగిన సమయంలో లైవ్ ఓవర్‌హెడ్ కేబుల్ తెగి బోగీలపై పడిందని, దీంతో విద్యుత్ షాక్ జరిగిందని రైల్వే పోలీసులు తెలిపారు.
‘‘కోరమాండల్ ఎక్స్‌ప్రెస్ (Coromandel Express) గూడ్స్ రైలును ఢీకొట్టిన తర్వాత ఎక్స్‌ప్రెస్ రైలు బోగీలు పట్టాలు తప్పాయి. ఇందులో కొన్ని పక్కనున్న ట్రాక్‌పై పడ్డాయి. అదే సమయంలో ఆ మార్గంలో బెంగళూరు-హావ్‌డా (Bengaluru Howrah Express) ఎక్స్‌ప్రెస్ రావడంతో.. ఆ రైలు పట్టాలు తప్పిన కోరమాండల్ బోగీలను బలంగా ఢీకొట్టింది. ఈ ప్రమాద తీవ్రతకు ఓవర్‌హెడ్ లోటెన్షన్ లైన్ విద్యుత్ తీగలు తెగి బోగీలపై పడ్డాయి. దీంతో విద్యుదాఘాతం కూడా చోటుచేసుకుంది. బోగీల మధ్య నలిగిపోవడంతో చాలా మృతదేహాలు గుర్తుపట్టలేని విధంగా ఛిద్రమయ్యాయి. అయితే, దాదాపు 40 మృతదేహాలపై ఎలాంటి గాయాలు కన్పించలేదు. రక్తస్రావం జరిగిన ఆనవాళ్లూ లేవు. బోగీలపై లోటెన్షన్ వైర్ పడి విద్యుత్ ప్రసరించడంతో వీరు కరెంట్ షాక్‌కు గురై చనిపోయి ఉండొచ్చని భావిస్తున్నాం’’ అని ఆ పోలీసు అధికారి వెల్లడించారు.
ఈ ప్రమాదంపై ఒడిశా పోలీసులు (Odisha Police) కేసు నమోదు చేశారు. నిర్లక్ష్యంతో ప్రాణాలకు హాని కలిగించడం, మరణాలకు కారణమవ్వడం వంటి అభియోగాలతో ఈ ఎఫ్‌ఐఆర్ నమోదు చేసినట్లు తెలుస్తోంది. అయితే ఈ దుర్ఘటన వెనుక కుట్ర కోణం ఉందన్న ఆరోపణలు రావడంతో సీబీఐ రంగంలోకి దిగింది. నేడు ఘటనాస్థలానికి వెళ్లిన సీబీఐ అధికారుల బృందం దర్యాప్తు ప్రారంభించింది.
Trending
గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని


తాజా వార్తలు (Latest News)
-
CEO Telangana: ‘ఓటరు సహాయ మిత్ర’ పేరుతో చాట్‌బాట్.. అందుబాటులోకి తెచ్చిన ఈసీ
-
Ravichandran Ashwin అదృష్టమంటే అశ్విన్‌దే.. క్రికెట్ అభిమానులు సుడిగాడు అంటున్నారు!
-
Top Ten News @ 9 PM: ఈనాడు.నెట్‌లో టాప్ 10 వార్తలు
-
Law Commission: అప్పట్లో.. శృంగార సమ్మతి వయసు ‘పదేళ్లే’!
-
జీతం లేకుండా పనిచేస్తానన్న సీఈఓ.. కారణం ఇదే..!
-
EPFO: అధిక పింఛను వివరాల అప్‌లోడ్‌కు మరింత గడువు