Tamil Nadu: తమిళనాడులో విషాదం.. నాటు సారా తాగి పలువురి మృతి!

నాటుసారా తాగి పలువురు మృతిచెందిన విషాద ఘటన తమిళనాడులో చోటుచేసుకుంది.

Published : 19 Jun 2024 22:14 IST

చెన్నై: తమిళనాడులోని కళ్లకురిచ్చి జిల్లాలో విషాదం చోటుచేసుకుంది. నాటు సారా తాగి కనీసం ఐదుగురు మృతి చెందగా.. దాదాపు 20 మంది  అస్వస్థతతో ఆస్పత్రిలో చికిత్సపొందుతున్నట్లు సమాచారం. ఈ ఘటనపై ప్రభుత్వం తీవ్రంగా స్పందించింది. ఈ ఘటనలో జిల్లా కలెక్టర్‌ను బదిలీ చేసి, ఎస్పీని సస్పెండ్‌ చేసిన స్టాలిన్‌ సర్కార్‌.. వారిస్థానంలో కొత్త వారిని నియమించింది.  అలాగే, విషాదంపై సీబీ సీఐడీ దర్యాప్తునకు సీఎం స్టాలిన్‌ ఆదేశించారు. ఈ ఘటనలో కె.కన్నకుట్టి అనే వ్యక్తిని అరెస్టు చేసి 200 లీటర్లకు పైగా అక్రమ సారాను సీజ్‌ చేశారు.

ఈ ఘటనపై సీఎం స్టాలిన్‌ తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. ఈ ఘటన తనను ఎంతగానో కలిచి వేసిందని..  నేరాలకు పాల్పడిన వారిని అరెస్టు చేసినట్లు పేర్కొన్నారు.  ఇలాంటి ఘటనల్ని నివారించడంలో విఫలమైన అధికారులపైనా చర్యలు తీసుకున్నట్లు ‘ఎక్స్‌’ వేదికగా వెల్లడించారు. ఇలాంటి నేరాలకు పాల్పడుతున్నవారి గురించి ప్రజలకు తెలిస్తే వెంటనే సమాచారం ఇస్తే చర్యలు తీసుకుంటామన్నారు.  సమాజాన్ని నాశనం చేసే ఇలాంటి నేరాల్ని ఉక్కుపాదంతో అణచివేస్తామని హెచ్చరించారు.  బాధిత కుటుంబాలకు అవసరమైన సహయ సహకారాలు అందించేందుకు మంత్రులు ఈవీ వేలు, మా సుబ్రమణియన్‌లను అక్కడికి పంపించారు. 

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని