Published : 04 Jul 2022 12:29 IST

Athar Khan: త్వరలో ఐఏఎస్‌ అధికారి అధర్‌ ఆమిర్‌ ఖాన్‌ వివాహం

ఇంటర్నెట్‌డెస్క్‌ : ఐఏఎస్‌ అధికారి అధర్‌ ఆమిర్‌ ఖాన్‌ మరోసారి వివాహ బంధంలోకి అడుగుపెట్టనున్నారు. గతంలో ఆయన ఐఏఎస్‌ టాపర్‌ టీనా దాబీని వివాహం చేసుకున్న విషయం తెలిసిందే. కొంత కాలం అనంతరం వీరు వీడిపోయారు. ఆదివారం శ్రీనగర్‌కు చెందిన డాక్టర్‌ మెహరీన్‌ ఖాజీతో తన ఎంగేజ్‌మెంట్‌ జరిగినట్లు అధర్‌ ఖాన్‌ ఇన్‌స్టాగ్రామ్‌లో ప్రకటించారు. ఈ మేరకు ఫొటోలు షేర్‌ చేశారు. ప్రస్తుతం ఖాన్‌ శ్రీనగర్‌ మున్సిపల్‌ కమిషనర్‌గా విధులు నిర్వహిస్తున్నారు. డాక్టర్‌ ఖాజీ యూకేలో ఉన్నత విద్యాభ్యాసం చేశారు.

2015 యూపీఎస్సీ పరీక్షల్లో టీనా దాబీ టాపర్‌గా నిలవగా.. అధర్‌ ఖాన్‌ రెండో ర్యాంకు సాధించారు. ఐఏఎస్‌ శిక్షణ సమయంలో అనంతనాగ్‌లో వీరి మధ్య తొలిసారి పరిచయం ఏర్పడింది. వీరిద్దరు రాజస్థాన్‌ కేడర్‌కు ఎంపికకాగా.. జైపుర్‌లో పోస్టింగ్‌ లభించింది. వీరి పరిచయం ప్రేమగా మారి 2018లో వివాహం చేసుకొన్నారు. వీరి వివాహానికి ఉపరాష్ట్రపతి, లోక్‌సభ స్పీకర్‌ తదితరులు హాజరయ్యారు.  అనంతరం ఈ జంట మధ్య విభేదాలు తలెత్తాయి. దీంతో వీరికి గతేడాది జైపుర్‌ ఫ్యామిలీ కోర్టు విడాకులు మంజూరు చేసింది. టీనా దాబీ ఇటీవలే ఐఏఎస్‌ అధికారి ప్రదీప్‌ గవాండేను వివాహం చేసుకున్న విషయం తెలిసిందే.

Read latest India News and Telugu News

Follow us on Facebook, Twitter, Instagram, Koo, ShareChat, and Google News.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సు సాంకేతికతతో పంపబడతాయి. ఏ ప్రకటనని అయినా పాఠకులు తగినంత జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

ap-districts
ts-districts