Atishi hunger strike: క్షీణించిన దిల్లీ మంత్రి ఆతిశీ ఆరోగ్యం.. ఆసుపత్రికి తరలింపు

Atishi hunger strike: దిల్లీ నీటి సంక్షోభ నివారణకు హరియాణా ప్రభుత్వం నీటిని విడుదల చేయాలని డిమాండ్‌ చేస్తూ నిరాహార దీక్ష చేపట్టిన దిల్లీ మంత్రి ఆతిశీ ఆరోగ్యం క్షీణించటంతో ఆమెను ఆసుపత్రిలో చేర్చారు.

Updated : 25 Jun 2024 12:45 IST

Atishi hunger strike | దిల్లీ: నిరవధిక నిరాహార దీక్ష చేపట్టిన దిల్లీ మంత్రి ఆతిశీ (Atishi hunger strike) ఆరోగ్యం క్షీణించటంతో ఆసుపత్రిలో చేర్చారు. ఆమె రక్తంలో చక్కెరస్థాయిలు పూర్తిగా పడిపోయిన నేపథ్యంలో మంగళవారం తెల్లవారుజామున ఆసుపత్రికి తరలించినట్లు ఆమ్‌ ఆద్మీ పార్టీ (AAP) వర్గాలు వెల్లడించాయి. ప్రస్తుతం ఆమె లోక్‌నాయక్‌ హాస్పిటల్‌లో ఐసీయూ వార్డులో ఉన్నట్లు ఎక్స్‌ వేదికగా తెలిపాయి.

‘‘మంత్రి ఆతిశీ ఆరోగ్యం పూర్తిగా క్షీణించింది. ఆమె రక్తంలోని చక్కెర స్థాయిలు అర్ధరాత్రి సమయంలో 43కు పడిపోయాయి. తెల్లవారుజామున 3 గంటల సమయానికి 36కు చేరాయి. దీంతో ఎల్‌ఎన్‌జేపీ వైద్యులు వెంటనే ఆసుపత్రికి తరలించాలని సూచించారు. హరియాణా ప్రభుత్వం నీటిని విడుదల చేయాలన్న డిమాండ్‌తో నిరవధిక నిరాహార దీక్ష (Atishi hunger strike) చేస్తున్న ఆమె గత ఐదు రోజులుగా ఏమీ తినలేదు. ప్రస్తుతం ఆమె ఎల్ఎన్‌జేపీ ఆసుపత్రిలో ఐసీయూలో చికిత్స పొందుతున్నారు. త్వరగా కోలుకోవాలని ప్రార్థిస్తున్నాం’’ అని ఆప్‌ ఎక్స్‌లో పోస్ట్‌ చేసింది.


Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని