Updated : 26 Jun 2022 15:12 IST

Emergency:ప్రజాస్వామ్యాన్ని తొక్కి పెట్టేందుకు యత్నించారు..ఎమర్జెన్సీని గుర్తుచేసుకున్న ప్రధాని

దిల్లీ: 1975లో విధించిన ఎమర్జెన్సీ ద్వారా ప్రజాస్వామ్యాన్ని తొక్కిపెట్టే ప్రయత్నాలు జరిగాయని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఆరోపించారు. అలాంటి ధిక్కార ఆలోచనలను ప్రజాస్వామ్యరీతిలో ఓడించిన తీరు ప్రపంచంలోనే మరెక్కడా కనపడదని వ్యాఖ్యానించారు. నెలవారీ ‘మన్‌ కీ బాత్‌’లో భాగంగా ఆయన ఎమర్జెన్సీ నాటి రోజుల్ని గుర్తుచేసుకున్నారు. జూన్‌ 25, 1975న అప్పటి ప్రధాని ఇందిరా గాంధీ ఎమర్జెన్సీ విధించిన విషయం తెలిసిందే. మార్చి 17, 1977న దాన్ని ఎత్తివేశారు.

ఎమర్జెన్సీ సమయంలో ప్రజల అన్ని హక్కులను లాక్కున్నారని మోదీ తాజాగా విమర్శించారు. రాజ్యాంగంలోని ఆర్టికల్‌ 21 ద్వారా దఖలుపడిన జీవించే, వ్యక్తిగత స్వేచ్ఛా హక్కును సైతం హరించారన్నారు. న్యాయస్థానాలు, రాజ్యాంగబద్ధ సంస్థలు, పత్రికలు.. ఇలా అన్నింటినీ నియంత్రించారని ఆనాటి ప్రభుత్వంపై నిప్పులు చెరిగారు. అనుమతి లేకుండా ఏ విషయాన్ని ప్రచురించేందుకు వీలుండేది కాదని గుర్తుచేశారు. ‘‘ప్రభుత్వాన్ని ప్రశంసించడానికి ప్రముఖ గాయకుడు కిశోర్‌ కుమార్‌ నిరాకరించడంతో ఆయన్ని బహిష్కరించారు. రెడియోలో ఆయన కార్యక్రమాలను అనుమతించలేదు’’ అని మోదీ గుర్తు చేసుకున్నారు. 

అనేక మందిని అరెస్టు చేసి దురాగతాలకు పాల్పడినప్పటికీ.. ప్రజాస్వామ్యంపై భారతీయులకు ఉన్న విశ్వాసాన్ని మాత్రం సడలించలేకపోయారని మోదీ అన్నారు. చివరకు అదే ప్రజలకు విజయాన్ని చేకూర్చి పెట్టిందన్నారు. ప్రజాస్వామ్యం ద్వారానే తిరిగి భారతీయులు ప్రజాస్వామ్యాన్ని పునఃప్రతిష్టించారని అన్నారు. ఎమర్జెన్సీ సమయంలో ప్రభుత్వానికి వ్యతిరేకంగా జరిగిన ఉద్యమంలో తానూ పాల్గొన్నానని ప్రధాని తెలిపారు. స్వాతంత్ర్యం సిద్ధించి 75వ సంవత్సరంలోకి అడుగిడిన సందర్భంగా ఎమర్జెన్సీ నాటి చీకటి రోజులను మర్చిపోవద్దని అన్నారు. భవిష్యత్తు తరాలు కూడా దీన్ని మరవొద్దని సూచించారు.


Read latest India News and Telugu News

Follow us on Facebook, Twitter, Instagram, Koo, ShareChat, and Google News.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సు సాంకేతికతతో పంపబడతాయి. ఏ ప్రకటనని అయినా పాఠకులు తగినంత జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

ap-districts
ts-districts

ఎక్కువ మంది చదివినవి (Most Read)

మరిన్ని