2022 Beijing Winter Olympics: అమెరికా బాటలో ఆస్ట్రేలియా..!

అమెరికా బాటలోనే ఆస్ట్రేలియా పయనించింది. 2022 బీజింగ్‌ వింటర్‌ ఒలింపిక్స్‌ను దౌత్యపరంగా బహిష్కరిస్తున్నట్లు ఆస్ట్రేలియా

Updated : 09 Dec 2021 04:33 IST

ఇంటర్నెట్‌డెస్క్‌: అమెరికా బాటలోనే ఆస్ట్రేలియా పయనించింది. 2022 బీజింగ్‌ వింటర్‌ ఒలింపిక్స్‌ను దౌత్యపరంగా బహిష్కరిస్తున్నట్లు ఆస్ట్రేలియా ప్రధాని స్కాట్‌ మారిసన్‌ బుధవారం ప్రకటించారు. పలు అంశాలపై చైనాతో తీవ్ర విభేదాలు కొనసాగుతుండటంతో ఆస్ట్రేలియా ఈ నిర్ణయం తీసుకొంది. 1989లో తియానన్మన్‌ స్క్వేర్‌ ఘటన తర్వాత ఇరు దేశాల సంబంధాలు ఈ స్థాయిలో పతనం కావడం ఇదే తొలిసారి. 

ఈ సందర్భంగా మారిసన్‌ మాట్లాడుతూ ‘‘ఆస్ట్రేలియా ప్రయోజనాల విషయంలో స్థిరంగా నిలబడేందుకు ఏమాత్రం వెనక్కి తగ్గము. అలాంటప్పుడు ఆస్ట్రేలియా అధికారులు బీజింగ్‌ వింటర్‌ ఒలింపిక్స్‌లో పాల్గొనకపోవడంలో విశేషం ఏముంది’’ అని వ్యాఖ్యనించారు. అదే సమయంలో చైనా మానవహక్కుల ఉల్లంఘన అంశాన్ని కూడా ఆయన ప్రస్తావించారు. 

ఆస్ట్రేలియా నిర్ణయంపై కాన్‌బెర్రాలలోని చైనా దౌత్య ప్రతినిధి స్పందించారు. ‘‘చైనాతో సంబంధాలు మెరుగుపర్చుకోవాలంటూ ఆస్ట్రేలియా బహిరంగ ఆంక్షలపై ఈ నిర్ణయం ప్రతికూల ప్రభావం చూపిస్తుంది’’ అని పేర్కొన్నారు. ఇక ఆస్ట్రేలియా నిర్ణయాన్ని హ్యూమన్‌ రైట్స్‌ వాచ్‌ చైనా డైరెక్టర్‌ సోఫీ రిచర్డ్‌సన్‌  స్వాగతించారు. ఇది కీలక నిర్ణయమే అయినా.. వీఘర్లను, తుర్క్‌ తెగలను వేధిస్తున్న చైనాకు వ్యతిరేకంగా నిలబడటానికి ఉపయోగపడుతుంది’’ అని పేర్కొన్నారు.

Read latest Sports News and Telugu News

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని