క్వాడ్‌ అజెండా అదే..! 

క్వాడ్‌ కూటమి ఏర్పడిన తర్వాత నేడు తొలిసారి భారత్‌,అమెరికా,జపాన్‌,ఆస్ట్రేలియా  దేశాధినేతల స్థాయి వర్చువల్‌ సమావేశం నేడు జరగనుంది. దీనిపై ఆస్ట్రేలియా ప్రధాని స్కాట్‌ మారిసన్‌ స్పందించారు. ఇండో-పసిఫిక్‌, వాతావరణ మార్పులు, కొవిడ్-19 వ్యాప్తి అంశాలే ప్రధానంగా నేడు

Updated : 12 Mar 2021 23:31 IST

* వెల్లడించిన ఆస్ట్రేలియా ప్రధాని స్కాట్‌ మోరిసన్‌

ఇంటర్నెట్‌డెస్క్: క్వాడ్‌ కూటమి ఏర్పడిన తర్వాత నేడు తొలిసారి భారత్‌, అమెరికా, జపాన్‌, ఆస్ట్రేలియా దేశాధినేతల స్థాయి వర్చువల్‌ సమావేశం జరగనుంది. దీనిపై ఆస్ట్రేలియా ప్రధాని స్కాట్‌ మోరిసన్‌ స్పందించారు. ఇండో-పసిఫిక్‌, వాతావరణ మార్పులు, కొవిడ్-19 వ్యాప్తి అంశాలే అజెండాగా ఈ సమావేశం జరగనుందని సిడ్నిలో విలేకర్లకు వెల్లడించారు. ‘‘ఇదొక చారిత్రక సందర్భం.. శనివారం తెల్లవారుజామున సమావేశం జరగనుంది. ఆస్ట్రేలియాకు అత్యంత కీలకమైన ఈ సమావేశం కోసం నేను ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తున్నాను. చాలా సమావేశాలు జరగుతున్నాయి. కానీ, దేశాధినేతల స్థాయిలో జరుగుతున్న ఈ సమావేశం ప్రాధాన్యం వేరు. ఇండో-పసిఫిక్‌లో శాంతి స్థాపనకు సరికొత్త స్థాయిలో ప్రయత్నాలు జరుగుతున్న విషయాన్ని ఈ భేటీ తెలియజేస్తుంది’’ అని వ్యాఖ్యానించారు.

ఈ అనధికారిక బృందంలో భారత్‌, అమెరికా, జపాన్‌, ఆస్ట్రేలియాలు సభ్యదేశాలు. ఇండో-పసిఫిక్‌లో చైనాను కట్టడి చేయడమే లక్ష్యంగా ఇది పనిచేయనుంది. దీనిలో భాగంగా ఈ ప్రాంతంలో చైనా రాజకీయ, వాణిజ్య, సైనిక కార్యకలాపాలను కట్టడి చేయనుంది. వర్చువల్‌గా నిర్వహిస్తున్న ఈ సమావేశం దాదాపు 2 గంటలపాటు జరగనుంది. భవిష్యత్తులో ఈ నేతలు వ్యక్తిగతంగా సమావేశం అయ్యేందుకు అవసరమైన అంశాలు కూడా దీనిలో చర్చించనున్నారు. ఈ దేశాలను ఉద్గార రహితంగా మార్చేందుకు అవసరమైన అంశాలపై కూడా చర్చించనున్నట్లు మోరిసన్‌ పేర్కొన్నారు. భారత్‌లో టీకాల తయారీ సామార్థ్యాన్ని పెంచేందుకు అవసరమైన ఆర్థిక సహకారంపై కూడా చర్చ జరగనుంది.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని