Omicron: ఆస్ట్రేలియాలో ఒమిక్రాన్‌తో తొలి మరణం..

ఆస్ట్రేలియాలో తొలిసారి ఒమిక్రాన్‌ పేషెంట్‌ మృతిచెందాడు. ఈ ఘటన సోమవారం చోటు చేసుకొంది. ఇతర ఆరోగ్య సమస్యలతో బాధపడుతున్న 80 ఏళ్ల వ్యక్తికి ఒమిక్రాన్‌ వేరియంట్‌ సోకింది.

Updated : 27 Dec 2021 11:31 IST

ఇంటర్నెట్‌డెస్క్‌: ఆస్ట్రేలియాలో ఒమిక్రాన్‌ కారణంగా తొలి మరణం నమోదైంది. అనారోగ్య సమస్యలతో బాధపడుతున్న 80 ఏళ్ల వ్యక్తికి ఇటీవల ఒమిక్రాన్‌ వేరియంట్‌ సోకింది. అతడు సోమవారం కన్నుమూశాడు. వృద్ధుల సంరక్షణా కేంద్రంలో అతడికి ఈ వైరస్‌ సోకినట్లు అధికారులు పేర్కొన్నారు. అంతకు మించిన వివరాలను వెల్లడించిందుకు అధికారులు నిరాకరించారు. ఆస్ట్రేలియాలో ఇప్పటికే పలు మార్లు లాక్‌డౌన్లు విధించారు. ఈ నేపథ్యంలో తాజాగా ఒమిక్రాన్‌ పేషెంట్‌ మృతితో మళ్లీ కఠిన ఆంక్షలు విధించే అవకాశం ఉందని భావిస్తున్నారు. మరోపక్క అక్కడ రోజువారీ కేసుల సంఖ్యలో కూడా పెరుగుదల కనిపిస్తోంది.

‘‘ఒమిక్రాన్‌ వేరియంట్‌కు సంబంధించి న్యూసౌత్‌ వేల్స్‌లో తొలి మరణం నమోదైంది’’ అని ఎపిడమాలజిస్టు క్రిస్టియన్‌ సెల్వే చెబుతున్న వీడియోను ఆస్ట్రేలియా ప్రభుత్వం విడుదల చేసింది. ఆస్ట్రేలియాలోని న్యూసౌత్‌ వేల్స్‌, విక్టోరియా, క్వీన్స్‌ల్యాండ్‌ రాష్ట్రాల్లో కలిపి నిన్న ఒక్కరోజే 9,107 కరోనా కేసులు బయటపడ్డాయి. క్విన్స్‌ల్యాండ్‌లో పర్యాటించాలనుకునేవారు పీసీఆర్‌ పరీక్షల నివేదికను తప్పనిసరిగా చూపించాలని  అక్కడి ప్రీమియర్‌  వెల్లడించారు. 


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని