60 ఏళ్లలో అత్యధికం.. నీట మునిగిన సిడ్నీ

ఆస్ట్రేలియాలో భారీ వర్షాలకు వరదలు పోటెత్తుతున్నాయి. సిడ్నీ నగరం నీట మునిగింది. ఇళ్లు, కార్యాలయాలు, షాపింగ్‌ మాళ్లలోకి వరద నీరు చేరింది. నిత్యావసరాలు దొరక్క ప్రజలు ఇబ్బందులకు గురవుతున్నారు....

Published : 23 Mar 2021 01:18 IST

సిడ్నీ: ఆస్ట్రేలియాలో భారీ వర్షాలకు వరదలు పోటెత్తుతున్నాయి. సిడ్నీ నగరం నీట మునిగింది. ఇళ్లు, కార్యాలయాలు, షాపింగ్‌ మాల్స్‌లోకి వరద నీరు చేరింది. నిత్యావసరాలు లభించక ప్రజలు ఇబ్బందులకు గురవుతున్నారు. వందలాది మంది ముంపు బాధితులను పునరావాస కేంద్రాలకు తరలించినట్లు అధికారులు వెల్లడించారు. గడిచిన 60 ఏళ్లలో ఇదే అత్యధిక వర్షపాతమని పేర్కొన్నారు. సిడ్నీలో సుమారు 54వేల మందిపై వరద ప్రభావం పడినట్లు ఆస్ట్రేలియా ప్రభుత్వం పేర్కొంది. వరదల్లో చిక్కుకున్న జంతువులను రక్షించేందుకు సిబ్బంది తీవ్రంగా శ్రమిస్తున్నారు. వరదల ధాటికి జలాశయాలు నిండు కుండలను తలపిస్తున్నాయి. సిడ్నీ సహా పలు నగరాల్లో పరిస్థితి దారుణంగా ఉందని ఆ దేశ వ్యవసాయ శాఖ మంత్రి డేవిడ్‌ లిటిల్‌ ప్రౌడ్‌ వెల్లడించారు. రాబోయే రెండు రోజుల్లో పరిస్థితి మరింత తీవ్రమయ్యే ప్రమాదం ఉందని, ప్రజలు జాగ్రత్తలు పాటించాలని సూచించారు. 


Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని