
Corona Crisis: భారత్కు ఆస్ట్రేలియా సాయం
దిల్లీ: కరోనా విజృంభణతో నెలకొన్న తీవ్ర సంక్షోభ సమయంలో భారత్కు సాయం అందించేందుకు ఆస్ట్రేలియా ముందుకొచ్చింది. వైద్య సామగ్రిని అందించనున్నట్టు ఆ దేశం వెల్లడించింది. 100 కాన్సెంట్రేటర్ల ఆక్సిజన్ ట్యాంకర్లు పంపేందుకు చర్యలు తీసుకోనుంది. అలాగే, పీపీఈ కిట్లు, ఇతర వైద్య సామగ్రిని వచ్చే వారం భారత్కు పంపించనుంది. 10లక్షల సర్జికల్ మాస్క్లు, 5లక్షల పీ2/ఎన్95 మాస్క్లు, సర్జికల్ గౌన్లు, గ్లౌజులు లక్ష చొప్పున, 20వేల ఫేస్ షీల్డ్లు భారత్కు సరఫరా చేయనున్నట్టు ఆస్ట్రేలియా ప్రభుత్వం వెల్లడించింది. వీటితో పాటు అత్యవసర వైద్య సామగ్రిని సైతం అందించాలని నిర్ణయించింది. 500 నాన్ ఇన్వెసివ్ వెంటిలేటర్లతో పాటు మొత్తం 3వేల వెంటిలేటర్లను భారత్కు ఇవ్వనున్నట్టు ఆస్ట్రేలియా ప్రభుత్వం ప్రకటించింది.
ఇవీ చదవండి
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సు సాంకేతికతతో పంపబడతాయి. ఏ ప్రకటనని అయినా పాఠకులు తగినంత జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.