covid: కొవిడ్‌పై పోరుకు కొత్త ఆయుధం సిద్ధం..!

కొవిడ్‌పై పోరాటంలో మరో కొత్త ఆయుధాన్ని ఆస్ట్రేలియా శాస్త్రవేత్తలు సిద్ధం చేస్తున్నారు. రక్తం పలుచబడేందుకు వినియోగించే హెపరిన్‌ అనే ఔషధాన్ని వారు పరీక్షించారు. ఇది చాలా చౌకగా లభిస్తుంది. నాజల్‌ స్ప్రేను వాడి

Published : 23 Dec 2021 01:26 IST

నేజల్‌ స్ప్రేను పరీక్షించిన ఆస్ట్రేలియా

ఇంటర్నెట్‌డెస్క్‌: కొవిడ్‌పై పోరాటంలో మరో కొత్త ఆయుధాన్ని ఆస్ట్రేలియా శాస్త్రవేత్తలు సిద్ధం చేస్తున్నారు. రక్తం పలుచబడేందుకు వినియోగించే హెపరిన్‌ అనే ఔషధాన్ని వారు పరీక్షించారు. ఇది చాలా చౌకగా లభిస్తుంది. నేజల్‌ స్ప్రేను వాడి ఓ కొవిడ్‌ రోగికి ఈ ఔషధాన్ని ముక్కులో పిచికారీ చేశారు. ఆ తర్వాత అతని నుంచి ఈ వైరస్‌ వ్యాపించిన దాఖలాలు లేవని వెల్లడించారు. కానీ, ఈ పరిశోధన పూర్తయ్యేందుకు 2022 ద్వితీయార్థం వరకు సమయం పట్టొచ్చని వెల్లడించారు. ఒక వ్యక్తికి కొవిడ్‌ సోకిన తొలినాళ్లలో ఈ స్ప్రే ఉపయోగపడొచ్చని శాస్త్రవేత్తలు వెల్లడించారు. దీంతోపాటు వైరస్‌ వ్యాప్తిని కూడా అరికట్టే అవకాశాలున్నట్లు పేర్కొన్నారు. 

ఈ ప్రయోగాలు విజయవంతమైతే కనుక ప్రజలకు మరో రక్షణ కవచం లభిస్తుందని శాస్త్రవేత్తల బృందానికి నాయకత్వం వహిస్తున్న డాన్‌ క్యాంప్‌బెల్‌ బీబీసీకి వెల్లడించారు. ‘‘రద్దీగా ఉండే షాపింగ్‌ లేదా ఫుట్‌బాల్‌ మ్యాచ్‌లకు వెళ్లే సమయంలో ఈ స్ప్రేను ముక్కులో పిచికారీ చేసుకొని వెళ్లే అవకాశం లభిస్తుంది’’ అని డాన్‌ క్యాంప్‌బెల్‌ వెల్లడించారు. 

ఇప్పటికే ప్రపంచ వ్యాప్తంగా పలు  నేజల్‌ స్ప్రేలను పరీక్షించారు. హెపరిన్‌పై పరీక్షలు నిర్వహించడం ఇదే తొలిసారి. ఈ ఔషధం మార్కెట్లో చాలా సులభంగా లభిస్తుంది. దీనిని పీల్చినప్పుడు ఇది నేరుగా రక్తంలో కలవకుండా ముక్కు రంధ్రాల్లో ఉంటుంది. వైరస్‌ దీనికి అతుక్కొని.. శరీర కణాల్లోకి ప్రవేశించకుండా ఉండే అవకాశం ఉందని శాస్త్రవేత్తలు చెబుతున్నారు. ఈ పరిశోధన కోసం విక్టోరియా రాష్ట్ర ప్రభుత్వం 3 మిలియన్‌ డాలర్లను కేటాయించింది. ఫిబ్రవరిలో మొదలుపెట్టిన ఈప్రయోగాల్లో భాగంగా కొవిడ్‌ రోగులున్న 400 గృహాల్లో దీనిని పరీక్షించనున్నారు.


Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని