అయోధ్య విమానాశ్రయం పేరు ఇదే

ప్రస్తుతం నిర్మాణ దశలో ఉన్న అయోధ్య విమానాశ్రయానికి ఉత్తర్‌ప్రదేశ్‌ సర్కారు పేరు ఖరారు చేసింది. రాముడి పేరు వచ్చేలా మర్యాద పురుషోత్తమ శ్రీరామ్‌ ఎయిర్‌పోర్ట్‌.........

Published : 22 Feb 2021 20:39 IST

లఖ్‌నవూ: ప్రస్తుతం నిర్మాణ దశలో ఉన్న అయోధ్య విమానాశ్రయానికి ఉత్తర్‌ప్రదేశ్‌ సర్కారు పేరు ఖరారు చేసింది. రాముడి పేరు వచ్చేలా మర్యాద పురుషోత్తమ్‌ శ్రీరామ్‌ ఎయిర్‌పోర్ట్‌ అని నామకరణం చేసింది. అలాగే బడ్జెట్‌లో ఎయిర్‌పోర్ట్‌ అభివృద్ధికి గానూ రూ.101 కోట్లు కేటాయించింది. దశలవారీగా దీన్ని అంతర్జాతీయ విమానాశ్రయంగా తీర్చిదిద్దనున్నట్లు బడ్జెట్‌లో పేర్కొంది. అలాగే, జవార్‌ ఎయిర్‌పోర్టులో ప్రస్తుతం రెండుగా ఉన్న ఎయిర్‌ స్ట్రిప్పులను ఆరుకు పెంచేందుకు రూ.2000 కోట్లు యోగి సర్కారు కేటాయించింది. అలీగఢ్‌, మొరాదాబాద్‌, మీరట్‌ వంటి నగరాలకు సైతం త్వరలో విమాన సేవలు అందబోతున్నాయని యోగి ఆదిత్యనాథ్‌ వెల్లడించారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని